వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నారబ్బా ? పెరిగిపోతున్న టెన్షన్

Mon Feb 22 2021 16:00:01 GMT+0530 (IST)

Revanth Reddy And Priyanka Gandhi Had Secret Discussions

ఇపుడిదే తెలంగాణా కాంగ్రెస్ లో హాట్ టాపిక్ అయిపోయింది. విషయం ఏమిటో స్పష్టంగా బయటకు రాకపోవటంతో తెలంగాణా కాంగ్రెస్ లోని సీనియర్ నేతల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈ మధ్య బెంగుళూరులోని ఓ హోటల్లో మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ మనవడి వివాహ రిసిప్షెన్ జరిగింది. దానికి తెలంగాణాలోని కాంగ్రెస్ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ మధుయాష్కీ బలరామ్ నాయక్ లాంటి వాళ్ళు హాజరయ్యారు. ఇదే రిసెప్షన్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు.కాంగ్రెస్ నుండి ఇంతమంది సీనియర్లు హాజరవ్వటం పెద్ద విశేషం ఏమీకాదు. అయితే ఇదే కార్యక్రమానికి రాహూల్ గాంధితో పాటు ప్రియాంకగాంధి వాద్రా కూడా హాజరయ్యారు. రిసిప్షెన్ అయిపోయిన తర్వాత ప్రియాంక అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్లందరితోను ముచ్చటించారు. ప్రియాంక చుట్టు సీనియర్లు మాట్లాడుతున్న సమయంలోనే వాళ్ళకు కొద్ది దూరంలో రేవంత్ ఒక్కళ్ళె నిలుచున్నారు. ఆ విషయం ప్రియాంక దృష్టిలో పడింది.

వెంటనే రేవంత్ ను దగ్గరకు పిలిపించుకుని ప్రియాంక కొద్దిసేపు మాట్లాడారు. తర్వాత వాళ్ళ దగ్గర నుండి ఆమె తన కారు దగ్గరకు వెళ్ళిపోయారు. మామూలుగా అయితే ఇందులో పట్టించుకోవాల్సిన వార్త ఏమీలేదు. అయితే కారులోకి ఎక్కి కూర్చున్న ప్రియాంక్ వెంటనే సెక్యురిటి వాళ్ళని పంపి రేవంత్ ను కారుదగ్గరకు పిలిపించుకున్నారు. సెక్యురిటి వాళ్ళు రావటం రేవంత్ ను కలవటం ప్రియాంక పిలుస్తోందని చెప్పటాన్ని సీనియర్లందరు విన్నారు. దాంతో అందరు ఆశ్చర్యంగా ప్రియాంక-రేవంత్ వైపు చూడటం మొదలుపెట్టారు.

ఇక్కడితే ఈ ఘట్టం ముగిస్తే బాగానే ఉండేది. కానీ అసలు కత అక్కడే మొదలైంది. కారులోనే కూర్చుని మాట్లాడిన రేవంత్ ను హఠాత్తుగా కారులోకి వచ్చి కూర్చోమన్నారు. దాంతో రేవంత్ కారులోకి ఎక్కారు. వాళ్ళిద్దరు కారులోనే కూర్చుని ఓ ఐదు నిముషాలపాటు మాట్లాడుకున్నారట. తర్వాత రేవంత్ కారు దిగిపోగానే ప్రియాంక వెళ్ళిపోయారు.

రేవంత్ ను ప్రియాంక తన కారులోకి ఎక్కించుకుని మాట్లాడటమంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే రేవంత్ కాంగ్రెస్ లో చేరిన తర్వాత సోనియాగాంధి రాహూల్ గాంధితో మాత్రమే భేటీ అయ్యారట. ప్రియాంకను ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలేదట. అలాంటిది మొదటి సారి కలవటంతోనే ప్రత్యేకంగా రేవంత్ ను పిలిపించుకుని కారులో ప్రియాంక కూర్చోబెట్టుకోవటంతో  అందరు ఆశ్చర్యపోయారు. కారు దగ్గరకు వెళ్ళి ఏమి మాట్లాడారు ? కారులో కూర్చుని ఏమి మాట్లాడుకున్నారు ? అన్నదే ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది.