Begin typing your search above and press return to search.

దెయ్యాల హోటల్ : ఓ వైపు భయం, మరోవైపు రుచికరమైన ఆహారం!

By:  Tupaki Desk   |   16 May 2022 3:29 AM GMT
దెయ్యాల హోటల్ : ఓ వైపు భయం, మరోవైపు రుచికరమైన ఆహారం!
X
ఆహార ప్రియులను ఆకర్షించేందుకు రెస్టారెంట్ల నిర్వాహకులు అనేక రకాల పద్ధతులను పాటిస్తున్నారు. రుచికరమైన ఆహారాన్ని అందించడమే కాకుండా... రోబోలు, ట్రెయిన్ లు హోటళ్లు అంటూ వాటితో సర్వ్ చేయిస్తున్నారు. కానీ సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి సరికొత్త పద్ధతిలో దెయ్యాలతో ఆహారం పెట్టిస్తున్నారు. ఆ హోటల్లో ఉండే వారంతా దెయ్యాల్లానే కనిపిస్తారు. అయితే అక్కడ మీకు తినాలనిపిస్తే... చాలా ధైర్యం ఉండాల్సిందే. భయ పడుతూ వెళ్తే అక్కడ అస్సలే తినలేరు.

ముఖ్యంగా భయపడే చిన్న పిల్లలతో అక్కడికి వెళ్లాలంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ హర్రర్ థ్రిల్ ను పొందాలనుకునే వారు మాత్రం కచ్చితంగా అక్కడికి వెళ్లాల్సిందే. అయితే ఇలాంటి థ్రిల్ ను పొందేందుకు స్కేరీ హౌస్ లలోకి వెళ్లే ఉంటారు. కళ్ల చాటు నుంచి భయపడుతూనే ఓ వైపు సినిమా చూస్తూ.. ఆనందాన్ని పొందుతారు.

కానీ ఓ వైపు భయపడుతూ మరో వైపు రుచికరమైన ఆహారం తినాలంటే మాత్రం సౌదీ అరేబియాలోని రియాద్ లో ఇటీవల ప్రారంభమైన షాడోస్ రెస్టారెంట్ కు వెళ్లాల్సిందే.

షాడోస్ అంటే నీడలు అని అర్థం. అయితే ఈ రెస్టారెంట్ బయటి నుంచి చూస్తే చాలా మామూలుగా కనిపిస్తుంది. కాస్త దగ్గరికి వెళ్తే నీలం రంగు భవనానికి ఉన్న అద్దాల్లోంచి దెయ్యాల నీడలు కనిపిస్తాయి. భవనం పై నిప్పులు చెరుగుతున్న కళ్లతో గబ్బిలాల శిల్పాలు భయపెడతాయి. అంటే ఒకలాంటి బెదురుతోనే కస్టమర్లు రెస్టారెంట్ లోకి ఎంట్రీ ఇస్తారన్న మాట. ఇదంతా ఒకెత్తయితే లోపలికి అడుగు పెట్టిన తర్వాత లెక్క మరోలా ఉంటుంది. మసక చీకటిలో మీ ధైర్యానికి ఎన్నో పరీక్షలు మీ ధైర్యానికి ఎన్నో పరీక్షలు పెడుతూనే భయంతో నుంచి తెలియని థ్రిల్ ను అందిస్తుంది.

మనిషి రక్తానికి మరిగిన జాంబీస్, రక్త పిశాచాలు, వింత దెయ్యాలు హోటల్ లో విచ్చల విడిగా సంచరిస్తుంటాయి. వాటి మధ్యనే కస్టమర్లు విందు ఆరగించాల్సి ఉంటుంది. ఇక్కడ మెనూ కూడా భయపెడుతుంది. పుర్రెలు, రక్తాన్ని పోలిన ఫుడ్ కాసేపు ఇబ్బంది పెట్టినప్పటికీ వాతావరణం అలవాటు అయితే మాత్రం రుచికరమైన ఫుడ్ ను ఎంజాయ్ చేయొచ్చు అంటున్నారు. రెస్టారెంట్ ను సందర్శించిన వారంతా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను పొందుతున్నామని చెబుతున్నారు.

జాంబీ క్యాస్టూమ్స్ వేసుకున్న నటీనటులు థీమ్ కు తగ్గట్టుగా కస్టమర్లను ఓ వైపు భయపెడుతూనే మరో వైపు వినోదాన్ని అందిస్తారు. గోడలకు అమర్చిన టీవీల్లో కూడా హర్రర్ సినిమాలు వస్తుంటాయి. ఎరుపు, నలుపు, కాంబినేషన్ లో ఉండే అక్కడి వాతావరణంలో ప్రతి నిమిషం ఏదో ఒక థ్రిల్ ఎదురవుతూనే ఉంటుంది. వాటన్నిటిని చూస్తూనే రుచికరమైన ఆహారాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరెప్పుడైనా ఆ దేశానికి వెళ్తే... ఈ దెయ్యాల హోటల్ ను ఓసారి సందర్శించండి.