కోవిడ్ యోధుల పిల్లలకు ఎంబీబీఎస్ లో రిజర్వేషన్లు..!

Sat Nov 21 2020 13:20:23 GMT+0530 (IST)

Reservations in MBBS for children of Covid warriors

కరోనాపై పోరాడి ప్రాణాలు కోల్పయిన కోవిడ్ వారియర్స్ (ఫ్రంట్లైన్ ఆరోగ్య కార్యకర్తలు) పిల్లలకు 2020-20 విద్యా సంవత్సారానికి ఎంబీబీఎస్ కళాశాలలో రిజర్వేషన్లు కల్పిస్తున్నామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ఆరోగ్యకార్యకర్తలు ఎంతో కృషిచేశారని.. తమ ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు వైద్యం చేశారని పేర్కొన్నారు. వారి సేవలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికి మరిచిపోలేదని చెప్పారు. 2020-21 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులో వారికి రిజర్వేషన్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. కోవిడ్ యోధుల పిల్లలకు బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీలో సీట్లు కేటాయిస్తామని చెప్పారు. వీరితో పాటు ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి పిల్లలు జీవిత భాగస్వాములకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది రిటైర్డ్ వాలంటీర్ కాంట్రాక్ట్ రోజువారీ వేతనం అధోక్. స్థానిక పట్టణ సంస్థల్లో పనిచేసిన వారిని కరోనా వారియర్స్గా ప్రభుత్వం గుర్తిస్తుంది. రాష్ట్రాలు కేంద్ర ఆస్పత్రులు కేంద్ర రాష్ట్రాలు కేంద్రపాలితప్రాంతాలు ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కోవిడ్ సంబంధిత బాధ్యతల కోసం ఉంచిన కేంద్ర మంత్రిత్వ శాఖల ఆస్పత్రులో పనిచేసిన వారిని కూడా కోవిడ్ వారియర్స్గా గుర్తిస్తామన్నారు.  మెడికల్ కౌన్సిల్ కమిటీ (ఎంసిసి) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన నీట్ 2020 లో పొందిన ర్యాంక్ ఆధారంగా చనిపోయిన కోవిడ్ వారియర్స్ పిల్లలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

 ఈ ఏడాది కరోనా మహమ్మారి ఎందరో జీవితాలను అతలాకుతలం చేసింది. లాక్డౌన్తో ఇండ్లల్లో ఉండి అనేకమంది ఉపాధి కోల్పోయి దుర్భరంగా జీవితాలను గడిపారు. అయితే ఆరోగ్య కార్యకర్తలు మాత్రం ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడారు. కరోనా రోగులకు వైద్యం అందించారు. మారుమూల ప్రదేశాలకు వెళ్లి కరోనా పరీక్షలు నిర్వహించారు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరు వస్తున్నారో గుర్తించి క్వారంటైన్ సెంటర్కు తీసుకెళ్లారు. కరోనా వ్యాపించకుండా ఎంతో కృషి చేశారు. అయితే ఈ క్రమంలో కొందరు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. వీరి కోసం కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.