Begin typing your search above and press return to search.

రిప‌బ్లిక్ డే: ఏపీలో ఏం జ‌రిగిందో తెలిస్తే..!

By:  Tupaki Desk   |   27 Jan 2023 11:00 AM GMT
రిప‌బ్లిక్ డే:  ఏపీలో ఏం జ‌రిగిందో తెలిస్తే..!
X
దేశ‌వ్యాప్తంగా గురువారం.. గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. అదేవిధంగా ఏపీలోనూ జ‌రిగాయి. అయితే..ఏపీలో ఒక విశిష్ట‌త ఎప్పుడూ ఉంటుంది క‌దా.. అలానే ఈ రిప‌బ్లిక్ డే ఉత్స‌వాలు కూడా.. విశిష్ట‌త‌ను సంత‌రించుకున్నాయి. అదేంటంటే.. వేడుక‌ల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ చ‌దివిన ప్ర‌సంగంలో భారీ ఎత్తున త‌ప్పులు రావ‌డ‌మే! ఇక‌, ఈ విష‌యంపై ఏకంగా సీఎం జగన్‌ ఆరా తీసిన‌ట్టు తెలిసింది.

అంతేకాదు.. సీఎంవోలోని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య, సీఎం కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించి వివరణ కోరారని తెలిసింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ ప్రసంగంలో దొర్లిన కొన్ని పొరపాట్లపై సీఎం గ‌ట్టిగానే ప్ర‌శ్నించార‌ని స‌మాచారం.

గవర్నర్ ప్రసంగం అంతా నవరత్నాల పథకాల గురించి కావడంతో పాటు అందులో భాగంగా అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై పేర్కొన్న అంకెల విషయంలో భారీ ఎత్తున తప్పిదం దొర్లినట్టు తెలుస్తోంది. మరోవైపు పాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలు చేశామని గవర్నర్ ప్రసంగ పాఠంలో పేర్కొన్న ప్రభుత్వం.. అంతకు ముందు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగం గా 63 టీఎంసీల నీటిని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాకు తరలిస్తామని పేర్కొవడంపై సీఎం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

అలాగే న‌వ‌ర‌త్న ప‌థ‌కాల్లో భాగంగా జ‌గ‌న‌న్న ఇళ్ల ల‌బ్ధిదారుల సంఖ్య‌ను కూడా త‌క్కువ చేసి చూపించ డం.. కొన్ని జిల్లాల పేర్ల‌ను మ‌రిచిపోవ‌డం.. కొన్ని ఉమ్మ‌డి జిల్లాల‌ను పేర్కొన‌డంపైనా.. ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని.. తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. ఏపీలో ప‌రిస్థితి య‌థారాజా త‌థా అధికారులు అన్న‌ట్టుగా ఉంద‌ని అంటున్నారు. ఎందుకంటే.. "నా అక్క చెల్లెమ్మ‌లు" అనే ప‌దాన్ని కూడా సీఎం జ‌గ‌న్ త‌న ప్రంస‌గాల స‌మ‌యంలో చూసి చ‌దువుతున్నారు. ఇక‌, అధికారులు కూడా త‌ప్పులు చేస్తూనే ఉన్నారు అని అంటున్నారు నెటిజ‌న్లు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.