ప్రియాంక కు షాకిస్తున్న పాక్...ఐరాసాకు ఫిర్యాదు

Wed Aug 21 2019 22:21:44 GMT+0530 (IST)

Remove Priyanka Chopra as Goodwill Ambassador

ఆర్టికల్ 370 తొలగింపుతో భారత్ పై తీవ్రస్థాయికి చేరిన పాక్ పైత్యం మరింత విస్తృతం అవుతోంది. తాజాగా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ - గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా విషయంలో మరో చీప్ ట్రిక్ ప్రయోగించింది. భారత బలగాలు పాకిస్థాన్ లో ఎయిర్ స్ట్రయిక్స్ చేసినప్పుడు ప్రియాంక ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. తాజాగా కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ విధానాల్ని ఆమె సమర్థించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను ప్రస్తావిస్తూ - యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ దేశ మానవ వనరుల మంత్రి షిరీన్ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.ఇటీవల లాస్ ఏంజెల్స్ లో బ్యూటీకాన్ పేరిట జరిగిన కార్యక్రమానికి ప్రియాంక చోప్రా అతిథిగా విచ్చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ పాకిస్థాని వివాదం సృష్టించారు. `యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ అయివుండి భారత బలగాలు పాకిస్థాన్ లో ఎయిర్ స్ట్రయిక్స్ చేసినప్పుడు ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. అలా రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేయొచ్చా? ఓ పాకిస్థానీ మహిళగా నేను - నా దేశవాసులు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం. అలాంటిది మీరు పాక్‌పై యుద్ధానికి దారితీసేలా వ్యాఖ్యలు చేయడం సబబేనా?’ అని ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ - ``నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు బాధ్యత - గౌరవం ఉన్నాయి. నేను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నావ్. నేను కూడా అంతే. ఇలా అరవకు. అరిచి నీ పరువు తీసుకోకు. `` అని ఘాటు కౌంటర్ ఇచ్చారు.

అయితే ప్రపంచవ్యాప్త వేదికగా కార్యక్రమంలో పరువుపోవడంతో పాక్ గగ్గోలు పెడుతోంది. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసింది. ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్ కు లేఖ రాస్తూ ప్రియాంక చోప్రాను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు.