Begin typing your search above and press return to search.
వైశాలి కిడ్నాప్ కేసులో మిస్టర్ టీ నవీన్ కు రిలీఫ్?
By: Tupaki Desk | 14 Jun 2023 1:30 AM ISTకొద్ది నెలల క్రితం హైదరాబాద్ మహానగరంలోని శివారులో చోటు చేసుకున్న ఒక సినిమాటిక్ ఉదంతం పెను సంచలనంగా మారటం తెలిసిందే. మిస్టర్ టీ సంస్థల అధినేత నవీన్ రెడ్డి.. తాను ప్రేమించిన డెంటిస్టు వైశాలికి వేరే వారితో ఎంగేజ్ మెంట్ అవుతుందన్న కోపంతో.. తనతో పాటు దాదాపు యాభై అరవై మందితో కలిసి నానా యాగీ చేయటం.. తాను ప్రేమించిన అమ్మాయిని కిడ్నాప్ చేయటం.. ఆ క్రమంలో ఇంట్లో వారిని.. అడ్డుకున్న వారిపై దాడికి దిగటం లాంటివి చేసిన వైనం షాకింగ్ గా మారటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఎపిసోడ్ లో నవీన్ రెడ్డి మీద రాచకొండ పోలీసులు పీడీ యాక్టు పెట్టటం... అతన్ని రిమాండ్ కు తరలించటం లాంటివి చేశారు. అయితే.. తనపై పోలీసులు పెట్టిన పీడీ యాక్టును తీసేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించిన విచారణ తాజాగా జరిగింది. ఇరు వర్గాల వాదనల్ని విన్న హైకోర్టు.. తాజాగా తీర్పును వెలువరించింది.
నవీన్ రెడ్డిపై నమోదైన పీడీ యాక్టును కొట్టేస్తూ ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు.. ఆయనకు భారీ రిలీఫ్ ఇచ్చినట్లుగా చెప్పాలి. అయితే.. ఈ ఉదంతంలో నవీన్ వెర్షన్ ఒకలా చెబితే.. వైశాలి మరోలా చెప్పటం.. ఇంట్లో వారు ఒప్పుకోని కారణంగా మరో పెళ్లికి చేసుకుంటుందన్న కోపంతో తన వద్ద పని చేసే వారిని.. స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున వాహనాల్ని సమకూర్చి కిడ్నాప్ ప్లాన్ చేయటం చేశారు.
ఈ ఉదంతం మీడియాలో పెద్ద ఎత్తున రావటంతో పోలీసులు సైతం కఠిన చర్యల దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం సైతం సీరియస్ చర్యలకు తెరతీసింది. ఈ కేసులో నవీన్ జైలుకు వెళ్లగా.. ఆ తర్వాతి కాలంలో అతడికి బెయిల్ వచ్చింది. తాజాగా అతడిపై పెట్టిన పీడీ యాక్టును సైతం తీసేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం.. అతనికి అతి పెద్ద రిలీఫ్ గా చెప్పాలి.