ఏపీలో కరోనా కర్ఫ్యూ నిబంధనల్లో సడలింపులు !

Fri Jun 18 2021 15:00:02 GMT+0530 (IST)

Relaxation of corona curfew rules in AP

ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ వేళలను సడలించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు కరోనా వైరస్ విజృంభణ పై జరిగిన సమీక్షా సమావేశంలో కర్ఫ్యూ సడలింపుపై సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 20 నుంచి 30 వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.అయితే ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం 5 గంటల సమయానికి దుకాణాలు మూసివేయాల్సి ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలవుతుందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు వర్తించనుంది. కరోనా వైరస్ మహమ్మారి పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ మాత్రమే సడలింపు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం నడవనున్నాయి. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేస్తున్నారు. తాజా సడలింపులు ఈ నెల 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని వివరించారు.