వచ్చే మే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీకి అక్కడ ఎదురు గాలలు వీస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ పుంజుకుందని.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని.. పలు ఒపీనియన్ సర్వేలుస్పష్టం చేశాయి.
అయితే.. కర్ణాటక ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికలకు గేట్ వేగా భావిస్తున్న బీజేపీ ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రాన్ని చేజార నివ్వకుండా చూసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల్లో ఏపీ నేతల సాయం కూడా కోరుతున్నట్టు ప్రచారం సాగుతుంది . ఆ ప్రచారం లో ముఖ్యంగా అధి కారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్కు బీజేపీ నేతలు కీలక బాధ్యతలు అప్పగించారని అంటున్నారు .
కర్ణాటక ఎన్నికల్లో కనీసం 100 నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించే బాధ్యతను ఏకంగా.. వైసీపీకి అప్పగిం చారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. బీజేపీ కీలక నాయకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఇటీవల సీఎం జగన్ ఢిల్లీలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి సాయం చేయాలని.. ఆర్థికంగానే కాకుండా.. ప్రచారం పరంగా కూడా సాయం అందించాలని.. కనీసం 100 నియోజకవర్గాల్లో విజయం దక్కించుకునేలా వ్యూహాలు రెడీ చేసుకుని.. తమకు అందిరావాలని ఆయన నిర్దేశించినట్టు ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో నడుస్తుంది .
గత ఎన్నికల్లో కూడా.. వైసీపీ నేతలు.. బీజేపీ తరఫున ప్రచారం చేశారు అని కూడా వారు అంటున్నారు . అయితే.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కొంత మేరకు సాయం చేసింది.
అయితే.. ఏపీలో అధికారంలో ఉండడం.. బీజేపీతో సన్నిహితంగా మెలగడం.. పైగా వచ్చే ఏపీ ఎన్నికల్లో బీజేపీ సాయం లేకుండా.. నెగ్గే పరిస్థితి ఉండదని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చిందనే వార్తల నేపథ్యంలో ముందు మాకు అక్కడ సాయం చేయండనే షరతును అమిత్ షా వెల్లడించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది . దీంతో వైసీపీ అధినేత ఏం చేస్తారనే చర్చ సాగుతోంది.