Begin typing your search above and press return to search.

సుప్రీంతో పోరుకు సై! మోడీదే పైచేయా?!!

By:  Tupaki Desk   |   17 Jan 2023 10:37 AM GMT
సుప్రీంతో పోరుకు సై! మోడీదే పైచేయా?!!
X
కేంద్ర ప్ర‌భుత్వ‌మైనా.. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మైనా.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు త‌లొగ్గాల్సిందేన‌ని.. రాజ్యాంగం చెబుతోంది. ఆర్టిక‌ల్ 324 ద్వారా సుప్రీం కోర్టుకు విశేష అధికారాల‌ను క‌ట్ట‌బెట్టింది. దేశంలోని 547 మంది పార్ల‌మెంటు స‌భ్యులు చేసిన చ‌ట్టం కూడా స‌రైన నిబంధ‌నలు , విధానాల‌ను పాటించ‌క‌పోతే.. ఖ‌చ్చితంగా స‌ద‌రు చ‌ట్టాన్ని కొట్టేసిన సంద‌ర్బాలు కూడా ఉన్నాయి. అంటే.. దేశంలో ఏ వ్య‌వ‌స్థ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఉంచాల‌నేది.. ఉండాల‌నేది రాజ్యాంగ రూప‌క‌ర్త‌ల ప్ర‌ధాన ఆలోచ‌న‌గా క‌నిపిస్తుంది.

అయితే.. ఇప్పుడు అదే న్యాయ వ్య‌వ‌స్థ చుట్టూ.. కేంద్రం చిక్కుముళ్లు పేర్చుతోంది. ముఖ్యంగా న్యాయ‌మూ ర్తుల నియామ‌కాల విష‌యంలో త‌న పంథాను త‌ప్పుబ‌ట్టిన సుప్రీంకోర్టుపై పైచేయి సాధించేందుకు ప్ర‌య త్నిస్తోంది.

దీనిలో భాగంగానే సుప్రీం కోర్టు గ‌తంలో అంటే.. 2015లో కొట్టేసిన‌.. ఎన్ జేఏసీ(నేష‌న‌ల్ జ్యుడి షియ‌ల్ అప్పాయింట్‌మెంట్ క‌మిష‌న్‌)ను మరో రూపంలో తెర‌మీద‌కి తెస్తోంది. ఇదే.. తాజాగా సుప్రీం కోర్టు కు, కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు.. మ‌ధ్య ప‌ల్నాటి యుద్ధాన్ని రాజేసింది.

అస‌లు కేంద్రం వ్యూహ‌మేంటి? అనేది ఇక్క‌డ ఆసక్తిగా మారింది. వివిధ హైకోర్టుల‌కు నియ‌మించే న్యాయ మూర్తులను సుప్రీం కోర్టు కొలీజియం(న్యాయ‌మూర్తుల క‌మిటీ) ఎంపిక చేసి.. కేంద్ర న్యాయ శాఖ‌కు పంపుతుంది. వీటిని ఆమోదించి.. ఆయా హైకోర్టుల‌కు న్యాయ మూర్తుల‌ను ఓకే చేయ‌డం కేంద్ర ప్ర‌భుత్వ విధి. అయితే.. ఇక్క‌డే కేంద్రం త‌న పైచేయి సాధించేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్ప‌టికే ఉప‌రాష్ట్ర‌ప‌తి నుంచి కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజుజు వ‌ర‌కు కూడా న్యాయ‌మూర్తుల నియామ‌క ప్రక్రియ‌ను త‌ప్పుబ‌ట్టారు.

ఇక‌, ఉప‌రాష్ట్ర‌ప‌తి అయితే.. ఎన్ జేఏసీని సుప్రీం కోర్టు కొట్టివేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా? అని ప్ర‌శ్నించారు. న్యాయ వ్య‌వ‌స్థ‌.. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ క‌న్నా ఎక్కువ‌గా భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని తెగేసి చెప్పారు. ఇక‌, కిరెణ్ కూడా అదే పంథాలో ముందుకు సాగుతున్న‌రు.మొత్తంగా చూస్తే.

ఇప్ప‌టికే.. సీబీఐ, ఐటీ, ఈడీ స‌హా అనేక సంస్థ‌ల‌ను తమ అధీనంలో ఉంచుకున్నార‌ని కేంద్ంపై విమ‌ర్శ‌మ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను కూడా తమ అధీనంలో ఉంచుకునే ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌నేది స్ప‌ష్టం. మ‌రి సుప్రీం కోర్టు ఏం చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.