కొందరు తిండిమానేసినా సన్నబడంది ఇందుకే?

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

Reason Behind Unable to Reduce Body Weight in Some cases

ప్రపంచాన్ని కుదిపేస్తున్నది ఇప్పుడు ఉబకాయమే.. సన్నగా మారడానికి చాలా మంది చాలా ఖర్చు చేస్తున్నారు. కొందరు తిండి మానేసి మరీ డైట్ ప్లాన్ చేసుకుంటూ గంటల కొద్ది నడుస్తూ జిమ్ లో కష్టపడుతుంటారు. అయినా కూడా బరువు తగ్గరు. తిండి మానేసి - ఎక్సర్ సైజ్ లు చేసినా కూడా బరువు ఎందుకు తగ్గడం లేదనే దానిపై తాజాగా స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్ శాస్త్రవేత్తలు పరిశోధించారు..దాదాపు 13ఏళ్ల పాటు 54 మంది పురుషులు - స్త్రీల కొవ్వు కణజాలాల నమూనాలను తీసుకొని పరీక్షించారు. బరువు పెరగడానికి కొవ్వు కణజాలాల్లో ఉన్న లిపిడ్ల శాతం తగ్గడమే కారణమి తేల్చారు.

లిపిడ్ల శాతం భర్తీ అయిన వారు సన్నబడుతున్నారని.. కానీ లిపిడ్ల శాతం పూర్తిగా భర్తీ చేయలేని వారు బరువు తగ్గడం లేదని తేలింది.

ఈ కొవ్వు కణజాలల లిపిడ్ల శాతం అనేది మన తిండి - ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుందని.. శరీరతత్వం కూడా లిపిడ్లపై ప్రభావం చూపి బరువు తగ్గకుండా చేస్తుందని పరిశోధకులు తేల్చారు. సో కొంత మంది ఎంత తక్కువ తిన్నా వ్యాయామం చేసినా బరువు పెరగడానికి లిపిడ్ల శాతం తగ్గడమే కారణమని.. అలాంటి వైద్యులను సంప్రదించి వీటిని కవర్ చేసుకుంటేనే బరువు తగ్గుతారని పరిశోధకులు తేల్చారు.