Begin typing your search above and press return to search.

వాట్సాప్ పై కేంద్రం నిఘా.. ఇందుకే..?

By:  Tupaki Desk   |   9 Oct 2019 12:28 PM GMT
వాట్సాప్ పై కేంద్రం నిఘా.. ఇందుకే..?
X
ఎన్ క్రిప్టెడ్’ మెసేజెస్.. అంటే ఎవరికీ కనిపించకుండా పంపే సందేశాలు అని అర్థం. ఇలాంటి సందేశాలను వాట్సాప్, ఫేస్ బుక్, గూగుల్ సహా దేశంలో సోషల్ మీడియాలో సేవలందిస్తున్న సంస్థలు అమలు చేస్తున్నాయి. వినియోగదారుల మధ్య జరిగే సంభాషణలు తాము సహా ఎవరూ చూడరని.. భద్రతకు ఢోకాలేదని చెబుతున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ఈ భద్రతపై అనుమానాలు చెలరేగడంతో భారత టెలికాం నియంత్రణ సంస్త సైతం ఈ సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ కోసం కేంద్రానికి పలు సిఫారసులు చేసింది.

వాట్సాప్ సహా ఓటీటీ సేవలను ఇస్తున్న సంస్థలన్నీ రిజిస్ట్రర్ చేసుకోవాలని.. వినియోగదారులు పంపే సందేశాలను చట్టబద్ధంగా తాము చూసేందుకు అనుమంతించాల్సి ఉంటుందని ట్రాయ్ సిఫారసు చేసింది. ఈ ఎన్ క్రిప్టెడ్’ సందేశాలను పరిశీలించేందుకు తమకు అనుమతించాలంటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియా సంస్థలను కోరడానికి రెడీ అయ్యింది.ఇప్పటికే అమెరికా న్యాయ విభాగం కూడా ఎన్ క్రిప్టెడ్ సందేశాలను పరిశీలించే హక్కు ప్రభుత్వానికి ఉందంటూ సోషల్ మీడియా దిగ్గజాలపై కేసు పెట్టింది.

తాజాగా మద్రాస్ కోర్టులో వాట్సాప్ ఎన్ స్క్రిప్షన్ మెసేజ్ లపై ఓ వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. నకిలీ వార్తలు, చట్టవిరుద్ధ వినియోగదారులకు అడ్డుకునేలా ప్రతీ ఒక్కరు ఐడీ ప్రూఫ్ తప్పనిసరి చేయాలంటూ పిటీషన్ పేర్కొన్నారు.

అయితే వాట్సాప్ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. వినియోగదారుల సందేశాలను బయటపెట్టడం తమ కంపెనీ గోప్యతా విధానానికి విరుద్ధమంటూ వాట్సాప్ వాదిస్తోంది. ఇక ఫేస్ బుక్ సంస్థ కూడా ఈ గోప్యతను తాము పాటిస్తామని.. వినియోగదారులకు భంగం కలిగించమని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి..

దీంతో ఈ వివాదంపై సుప్రీం కోర్టు నివేదిక ఇవ్వాలని.. కేంద్ర ఐటీశాఖను ఆదేశించింది. 22న జరిగే విచారణ సమాయానికి సమర్పించాలని కోరింది.ట్రాయ్ కోరిక ఫలిస్తే మన సందేశాలను కేంద్రం కూడా చూసే వీలు కలుగుతుంది. అదే మన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుంది.