వీడియో వైరల్: అమెరికాలో గ్రహాంతర వాసులు?

Thu Oct 10 2019 17:16:42 GMT+0530 (IST)

Real UFO Shows Several Bright Lights Hovering Of N.C Coast

అమెరికాలోని నార్త్ కరోలినా రాష్ట్రంలో గ్రహాంతరవాసులు పయనించారనే పుకార్లు షికార్లు చేశాయి. నార్త్ కరోలినా ప్రాంతంలోని ఔటర్ బ్యాంక్స్  సముద్ర తీరం వద్ద ఆకాశంలో వెలుతురుతో కూడిన  ఎగిరే   పల్లెలను (ఫ్లయింగ్ సాసర్స్) గుర్తించారు. ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది.ఈ ఎగిరే వస్తువులు లైట్లతో ప్రకాశవంతంగా అకస్మాత్తుగా ఆకాశంలో పయనిస్తూ వెళ్లడం వీడియోలో చిక్కింది. ఇది గ్రహాంతరవాసులా లేక ఏదైనా సైనిక విన్యాసాలా..? పరీక్షల అన్నది మాత్రం తెలియరాలేదు.

ఈ వీడియోను విలియం గాయ్ అనే వ్యక్తి ‘అమెరికాలో ఫ్లైయింగ్ సాసర్స్’ అని పేర్కొంటూ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సాయంత్రం వేళ ఆకాశంలో ఈ అంతుచిక్కని కాంతివంతమైన ఎగిరే పల్లాలు కనిపించాయి. దాదాపు 14 ఫ్లయింగ్ సార్స్ వీడియో లో కనిపించాయి. 31 సెకన్ల వీడియో క్లిప్  ఒక్రోక్రాక్ ఇస్ ల్యాండ్ నుంచి స్వాన్ క్వార్టర్ మధ్య చిత్రీకరించబడింది.

అయితే కొందరు సైనికాధికారులు ఇదో మెరైన్ ఆపరేషన్ కావచ్చని వీడియో చూసి చెబుతున్నారు. విమానాల వెనుక ఉత్పత్తి అయ్యే మంటలే ఇలా కాంతివంతంగా ఆకాశంలో పయనించాయని వారుచెప్పారు. అయితే ఆ సమయంలో విమానాలు అక్కడ తిరుగలేదని ఆర్మీ తెలిపింది. సైనిక స్థావరం అక్కడి ప్రదేశానికి చాలా దూరంలో 125 కి.మీల దూరంలో ఉందని స్పష్టం చేశారు. దీంతో ఇవి గ్రహాంతరవాసులేనన్న చర్చ ఇప్పుడు అమెరికాలో సాగుతోంది.