Begin typing your search above and press return to search.

వార‌సులు స‌రే.. వీరిమాటేంటి? టీడీపీలో గుస‌గుస‌!

By:  Tupaki Desk   |   25 March 2023 6:00 AM GMT
వార‌సులు స‌రే.. వీరిమాటేంటి?  టీడీపీలో గుస‌గుస‌!
X
వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని భావిస్తున్న వారిలో కొంద‌రు వార‌సులు కూడా ఉన్న విష‌యం తెలిసిందే. అటు అధికార పార్టీ వైసీపీలోను... ఇటుప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలోనూ యువ నేత‌లు చెంగు చెంగున పోటీకి సై అంటున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. వార‌సుల‌కు టికెట్లు క‌ష్ట‌మ‌ని జ‌గ‌న్ చెప్పేసినా.. దాదాపు 10 చోట్ల వారికే కేటాయించే అవ‌కాశం ఉంది. ఇక‌, టీడీపీకి విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికే కొంద‌రికి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. మ‌రికొంద‌రు విష‌యంలో మాత్రం నాన్చుడు ధోర‌ణిని అవ‌లంభిస్తు న్నారు.

ఈ ప‌రిణామంతోనే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల మ‌ధ్య అల‌జ‌డి రేగుతోంది. ముఖ్యంగా.. పార్టీలో వార‌సు లుగా ఉన్న‌వారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన వారు కూడా ఇప్పుడు త‌మ‌కు టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయాల‌ని మొర‌పె ట్టుకుంటున్నారు. అయితే.. క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితిని ప‌రిశీలించిన త‌ర్వాతే.. త‌న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చంద్ర‌బాబు తేల్చి చెబుతున్నారు. దీంతో రాజ‌కీయంగా ఈ వార‌సులు త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌లో ఉన్నారు. ఉదాహ‌ర‌ణ‌కు స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని ఇద్ద‌రు కోరుతున్నారు.

మాజీ ఎంపీ రాయపాటి సాంబ‌శివ‌రావు కుమారుడు.. రాయ‌పాటి రంగారావు ఈ సీటును ఆశిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కోడెల కుమారుడు శివ‌రామ‌కృష్ణ కూడా కావాల‌ని కోరుతున్నారు. దీంతో ఈ సీటు చాలా హాట్ గా మారింది. మ‌రోవైపు న‌ర‌స‌రావుపేట టికెట్‌పైనా.. ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు క‌న్నేశారు. ప్ర‌స్తుత ఇంచార్జ్‌.. చ‌ద‌ల వాడ అరవింద‌బాబుతో పాటు.. క‌డ‌ప‌కు చెందిన మైదుకూరు నాయ‌కుడు.. టీటీడీ మాజీ చైర్మ‌న్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ కుమారుడు సైతం న‌ర‌సారావు పేటపై క‌న్నేశారు.

ఈ నేప‌థ్యంలో ఆయా సీట్ల‌పై త్వ‌ర‌గా తేల్చేయాల‌ని చంద్ర‌బాబుపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు ఏమీ తేల్చ‌లేదు. దీంతో త‌మ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని.. కోడెల వ‌ర్గం.. ఇటీవ‌ల ఇక్క‌డ పెద్ద కార్య‌క్ర‌మ‌మే చేసింది. మ‌రోవైపు.. త‌న సీటుకు ఎక్క‌డ ఎస‌రు వ‌స్తుందోన‌ని భయ‌ప‌డుతున్న న‌ర‌స‌రావు పేట ఇంచార్జ్ చ‌ద‌ల‌వాడ‌.. స‌వాళ్ల రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. దీంతో ఈ రెండు నియోజ‌క‌వ ర్గాల్లోనూ.. రాజ‌కీయం వేడెక్కింద‌నే చెప్పాలి.మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి. ప్ర‌స్తుతం అయితే.. రెండునియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ పాలిటిక్స్ స‌ల‌స‌ల కాగుతుండ‌డం గ‌మ‌నార్హం.