Begin typing your search above and press return to search.

అన్నం పెట్టింది కూడా అనాలా కేసీఆర్: రాయలసీమ ప్రజలు

By:  Tupaki Desk   |   11 Aug 2020 2:30 PM GMT
అన్నం పెట్టింది కూడా అనాలా కేసీఆర్: రాయలసీమ ప్రజలు
X
రాయలసీమ అంటే రాళ్లు , రప్పలు తప్పితే ఏమీ ఉండదు.. ఫ్యాక్షనిజం తప్పితే గుక్కెడు నీళ్లు కూడా లేని ప్రాంతమని ఎవరిని అడిగినా చెప్తారు. అలాంటి కరువు సీమకు గోదావరిలో వృథా పోయి సముద్రంలో కలుస్తున్న నీరును తరలించి సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గతంలో ఏపీ సీఎం జగన్ కు సూచించారు. రాయలసీమకు నీరు ఇవ్వాలని కేసీఆర్ గతంలో పెద్దమనసుతో జగన్ కు చెప్పాడు. సాగు, తాగునీటిని వాడుకొని రెండు రాష్ట్రాలు బాగుండాలని నిర్ణయించారు.

అయితే తెలంగాణ కాంగ్రెస్ లోని కొందరు నేతలు దీన్ని అడ్వంటేజ్ గా తీసుకొని సమస్యలు సృష్టిస్తున్నారు. కేసీఆర్ ఆంధ్రాకు నీటిని దోచిపెడుతున్నాడని టీఆర్ఎస్ ను కార్నర్ చేస్తున్నారు. తెలంగాణ ప్రజల దృష్టిలో విలన్ ను చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో విమర్శలకు భయపడి కేసీఆర్ కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో తాజాగా ఏపీతో జలవివాదాలపై కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. ‘బేసిన్లు, భేషాజాలు లేవని తాను చెప్పినా.. తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ఫిర్యాదు చేసిందని.. జగన్ కు పిలిచి మరీ అన్నం పెట్టాను.. అయినా మరిచిపోయాడని’ పుసుక్కున అనేశాడు. దీనిపై తాజాగా రాయలసీమ వాసులు నొచ్చుకున్నారట..

తెలుగు రాష్ట్రాల మధ్య ఎంత స్నేహం ఉన్నా .. జగన్ మాత్రం కరువు సీమకు నీటిని తీసుకెళ్లాలనే ప్రయత్నంలో వెనకడుగు వేయడం లేదు. అయితే కేసీఆర్ మాత్రం దీనిపై పంతానికి పోవడం తగదని.. తమ కష్టాలు చూసి కనికరించాలని రాయలసీమ వాసులు కోరుతున్నారు. ఏది అయితేనేం రెండు తెలుగు రాష్ట్రాలు నీళ్ల కోసం కొట్టుకోకుండా అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుందామని సీమ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.