మగ ఖైదీలపై పురుషులతో అత్యాచారం

Sun Aug 14 2022 14:02:43 GMT+0530 (India Standard Time)

Rape of Male Prisoners by Men

రష్యా అధ్యక్షుడే కాదు.. అక్కడి అధికారులు కూడా క్రూరంగా వ్యవహరిస్తారని తేలింది. రష్యా జైల్లలో అత్యంత దారుణంగా అత్యాచారాలు చిత్రహింసలు ఎలా చేస్తుంటారో మాజీ ఖైదీలు కథలు కథలుగా మీడియాతో పంచుకోవడం ప్రపంచవ్యాప్తంగా అందరినీ విస్తుపోయేలా చేసింది. నైరుతి రష్యాలోని సరటోవ్ ఖైదీల ఆస్పత్రికి సంబంధించిన కొన్ని ఘోరమైన లైంగిక వేధింపుల దృశ్యాలు గత ఏడాది ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. ఇవి మొదట మాన హక్కుల సంస్థ చేతికి వచ్చాయి. తర్వాత అంతర్జాతీయ మీడియాలో హైలెట్ అయ్యాయి.



2018లో ఈ జైలుకు బదిలీ చేసినప్పుడే దీని గురించి అలెక్సీ మకరోవ్ అనే వ్యక్తికి తెలిసింది. ఆరు నెలల జైలు శిక్షలో భాగంగా ఇక్కడికి వచ్చాడు. అయితే సరటోవ్ తోపాటు ఈ ప్రాంతంలోని ఇతర జైళ్లలో ఖైదీలు తరచూ ఫిర్యాదులు చేస్తుంటారు. వైద్యపరమైన చికిత్సల పేరుతో ఇక్కడకు తీసుకొచ్చి దారుణమైన చిత్రహింసలు పెడుతుంటారని ఆరోపిస్తున్నారు.

రష్యాలో జైళ్లను స్వతంత్రంగా పర్యవేక్షించే వ్యవస్థ లేదు. మరోవైపు ఖదీల ఆస్పత్రుల వారి క్వారంటైన్ నిబంధనలు కూడా జైలులో పట్టించుకోరు. మకరోవ్ కూడా 6 నెలల జైలు శిక్ష కోసం వచ్చాడు. అతడికి టీబీ సోకింది. అయినా వదిలిపెడుతారని అనుకున్నారు. తనపై రెండు సార్లు దారుణంగా అత్యాచారం చేశారని ఆయన వాపోయారు.

ఈ లైంగిక హింస వేధింపుల గురించి జైలు అధికారులకు తెలుసని బాధితులు చెబుతున్నారు. నేరాలను బలవంతంగా ఒప్పించేందుకు బ్లాక్ మెయిల్ చేసేందుకు భయపెట్టేందుకు ఇలాంటి భయానకమైన విధానాలను కొందరు ఎంచుకుంటారని బాధితులు నిపుణులు ఆరోపిస్తున్నారు.

ఈ లైంగిక వేధింపులు చిత్రహింసల వీడియోలు లీక్ కావడంతో రష్యా ప్రభుత్వం దీనిపై స్పందించాల్సి వచ్చింది. రష్యాలోని 90శాతం ప్రాంతాల్లో 2015 నుంచి 2019 మధ్య ఖైదీలను చిత్ర హింసలు పెట్టినట్టు నిజంగానే తేలింది. ఈ మేరకు రష్యా స్వతంత్ర మీడియా ప్రాజెక్ట్ 'ప్రోయెక్ట్' అధ్యయనంలో తేలింది. దీంతో ఈ దారుణ మానవహక్కుల ఘటన వెలుగుచూసింది.

ఖైదీలను అనైతికంగా వివిధ .శిక్షల్లో ఒప్పించేందుకు ఏకంగా మగవారిపైనే మగవారితో అత్యాచారం చేయించే దారుణం వెలుగుచూసింది. ఇంత జరిగినా దీనిపై పెద్దగా చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేకపోవడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.