Begin typing your search above and press return to search.

ప్రాజెక్టుల ఆకర్షణలో రెండోస్ధానం దక్కించుకుంది

By:  Tupaki Desk   |   14 Jan 2021 11:24 AM GMT
ప్రాజెక్టుల ఆకర్షణలో రెండోస్ధానం దక్కించుకుంది
X
కొత్త ప్రాజెక్టులను ఆకర్షించటంలో రాష్ట్రం రెండో స్ధానాన్ని దక్కించుకున్నట్లు ప్రాజెక్ట్స్ టుడే నివేదిక బయటపెట్టింది. మొన్నటి అక్బోటర్-డిసెంబర్ మధ్య దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి యాజమాన్యాలు ఏ మేరకు ఆసక్తి చూపిస్తున్నాయనే విషయమై ప్రాజెక్ట్స్ టు డే తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మహారాష్ట్రలో 215 ప్రాజెక్టులు పెట్టడానికి ప్రతిపాదనలు అందాయట. వీటి విలువ రూ. 54714 కోట్లు.

ఇక ఏపి విషయానికి వస్తే ప్రాజెక్టుల మొత్తం 108 మాత్రమే అయినప్పటికీ వాటి విలువ మాత్రం రూ. 29,784 కోట్లుంది. దీని కారణంగా రెండోస్ధానం సంపాదించుకుంది. ఇక ప్రధానమంత్రి నరేంద్రమోడి సొంత రాష్ట్రం గుజరాత్ ప్రాజెక్టుల సంఖ్యలో దేశంలోనే మొదటిస్ధానంలో ఉంది. ఈ రాష్ట్రానికి 266 ప్రాజెక్టులు వచ్చినప్పటికీ రూ. 26530 కోట్లు మాత్రమే ప్రతిపాదనలు వచ్చాయి. తర్వాత స్ధానాల్లో తమిళనాడు, ఒడిశ్శా, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తెలంగాణా, పంజాబ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలు నిలిచాయి.

ఏపికి వచ్చిన ప్రతిపాదనల్లో కూడా ఎక్కువగా ఫార్మా, సాగు, ఎలక్ట్రానిక్స్ రంగాలే ఉన్నాయి. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం ఫార్మా జోన్ను ఏర్పాటు చేసింది. అలాగే చిత్తూరుజిల్లాలోని శ్రీసిటి, నెల్లూరు జిల్లాలో ఎలక్ట్రానిక్స్ యూనిట్లను బాగా ప్రోత్సహిస్తోంది. ఇక్కడైతే ఉత్పత్తుల తయారీ, రవాణా తదితరాలకు బాగా ఎంకరేజింగా ఉండటంతో యాజమాన్యాలు కూడా యూనిట్ల ఏర్పాటుకు బాగా మొగ్గుచూపుతున్నాయి. అలాగే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో సుమారు రూ .10 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ఆసక్తి చూపటం గమనార్హం.