ప్రభాస్ జూ.ఎన్టీఆర్ లా కాదట.. కేసీఆర్ పై వర్మ హాట్ కామెంట్

Tue Sep 27 2022 16:03:55 GMT+0530 (India Standard Time)

Ram Gopal Varma Tweet on KCR

వర్ధమాన రాజకీయాలు సినిమాలపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే కామెంట్స్ ప్రతీసారి రచ్చ రేపుతుంటాయి. ఏపీ తెలంగాణ రాజకీయాలనే కాదు.. సినిమా ఇండస్ట్రీలో జరిగే సంగతులను వదలకుండా ట్వీట్లు చేస్తూ వర్మ మంటపెడుతూనే ఉంటారు. టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్తాయికి ఎదగడాన్ని ప్రశంసిస్తూనే.. హిందీ చిత్రపరిశ్రమ విలాపాన్ని దెప్పి పొడుస్తుంటారు.తాజాగా ప్యాన్ ఇండియా స్టార్స్ కు.. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఉద్దేశిస్తూ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ. 'బాహుబలి ఆర్ఆర్ఆర్ పుష్ప కేజీఎఫ్2' అడుగుజాడల్లోనే 'బీఆర్ఎస్' పేరుతో టీఆర్ఎస్ కూడా పాన్ ఇండియా స్థాయిలోకి వెళుతుంది. హీరోలు యశ్ ప్రభాస్ తారక్ రాంచరణ్ అల్లు అర్జున్ లా కాకుండా రియల్ పొలిటికల్ స్టార్ కేసీఆర్' అని రాంగోపాల్ వర్మ ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు.

తెలుగు రాష్ట్రాల నుంచి సినిమాలు వెళ్లి జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాయని.. అలాగే మన తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జాతీయ స్థాయిలో ఖచ్చితంగా రాణిస్తాడన్న నమ్మకం వర్మలో ఉన్నట్టుంది. అందుకే హీరోలకంటే మించి పొలిటికల్ స్టార్ కేసీఆర్ అవుతారని వర్మ నమ్మకంగా ఈ ట్వీట్ చెబుతున్నాడు.

దేశంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ విధానాలపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గెలవనీయకూడదని కేసీఆర్ కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే దసరాకు జాతీయ రాజకీయాల్లోకి వెళదామని అనుకుంటున్నారు. అందుకే వర్మ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ఆసక్త రేపుతోంది.

ఇక కేసీఆర్ నే కాదు.. వర్మ ఇటీవల ఇందిరాగాంధీని ఉద్దేవించి డైరెక్ట్ గా ట్వీట్ చేసి వివాదానికి తెరలేపారు. ఎమర్జెన్సీ మూవీలోని ఇందిరాగాంధీ పాత్ర పోషించిన కంగనా రౌనత్ మూవీపై ఈ కామెంట్ చేశారు. 1984 ఇందిరాగాంధీ ఇంటర్వ్యూ వీడియో షేర్ చేసిన వర్మ.. 'ఇందిరను కంగనా దింపేసింది' అంటూ కాంగ్రెస్ కు చురకలంటించారు. తాజాగా కేసీఆర్ పై రాజకీయ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.