Begin typing your search above and press return to search.

కేసీఆర్ కొత్త పార్టీపై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్

By:  Tupaki Desk   |   5 Oct 2022 10:40 AM GMT
కేసీఆర్ కొత్త పార్టీపై రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్
X
తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పార్టీకి పురుడు పోశాడు. ‘బీఆర్ఎస్’ అంటూ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశంలోని వివిధ పార్టీల నేతల సమక్షంలో దసరా రోజున ప్రకటించిన ‘బీఆర్ఎస్’ పార్టీని ప్రకటించారు.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది. అన్ని మీడియా, వివిధ జాతీయ పార్టీల నేతలు స్పందిస్తున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి తాము బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. కొన్ని పార్టీలు విలీనానికి సిద్ధమయ్యాయి.

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో జరిగే ప్రతీ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తూ కామెంట్ చేసే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్వర్మ కూడా తాజాగా స్పందించారు. ఆయన ఏం మాట్లాడినా సెటైరికల్ గా.. దెప్పి పొడిచేలా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ ను తిట్టాడో.. పొగిడాడో అర్థం కాకుండా మాట్లాడాడు.

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ పై వర్మ హాట్ కామెంట్స్ చేశాడు. ‘కేసీఆర్ ను తొలి ఆదిపురుష్ ’గా అభివర్ణించాడు. జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్న కేసీఆర్ కు వర్మ స్వాగతం పలికారు. వర్మ ఏకంగా కేసీఆర్ ను ఆదిపురుష్ గా అనడంతో ఆయన పొగిడాడా? విమర్శించాడో అర్థం కాక పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందించడానికి ఇష్టపడడం లేదు. దసరా సందర్భంగా.. బెజవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

చంద్రబాబు దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. కేసీఆర్ జాతీయ పార్టీ గురించి చంద్రబాబును ప్రశ్నించగా.. ‘ఆయన ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయారు’. కేసీఆర్ జాతీయ పార్టీని ఓ జోక్ గా చంద్రబాబు తన నవ్వుతో అభివర్ణించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు వీలుగా టీఆర్ఎస్ పేరును భారత్ రాష్ట్ర సమితి(‘బీఆర్ఎస్)గా మారుస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో పేరు మార్పుపై ప్రవేశపెట్టిన తీర్మానానికి 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.టీఆర్ఎస్ ను భారత్ రాష్ట్ర సమితిగా గుర్తించాలని కోరుతూ ఈసిని కొరేందుకు సాయంత్రం ఒక టీం ఢిల్లీ వెళ్లనుంది. ఈసీ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలను గమనించి అభ్యంతరాలు లేకుండా పేరును ఖాయం చేసి గుర్తును కేటాయిస్తారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.