Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీకి అలాంటి అమ్మాయే కావాలట?

By:  Tupaki Desk   |   23 Jan 2023 9:26 PM GMT
రాహుల్ గాంధీకి అలాంటి అమ్మాయే కావాలట?
X
దేశంలో ఎవర్ గ్రీన్ బ్యాచ్ లర్ ఎవరైనా ఉన్నారంటే అది మన రాహుల్ గాంధీనే. ఆయన పెళ్లి కోసం సోనియాగాంధీనే కాదు దేశమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. వయసు అయిపోతున్నా.. తెల్లగడ్డం వస్తున్నా కూడా రాహుల్ పెళ్లి మాట ఎత్తడం లేదు. ప్రభాస్ కూడా రాహుల్ ను స్ఫూర్తిగా తీసుకొని అదే బాటలో నడుస్తున్నాడు.

సరైన అమ్మాయి వస్తే పెళ్లి చేసుకుంటానని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తన తల్లిదండ్రుల లవ్ మ్యారేజ్ తనకు స్ఫూర్తి అని.. వారికంటే మించి తన లైఫ్ ఉండాలని భావిస్తున్నట్టు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. యూట్యూబ్‌లోని ఫుడ్ అండ్ ట్రావెల్ ప్లాట్‌ఫారమ్ కర్లీ టేల్స్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ తన వయసు పెరుగుతున్న పెళ్లి కాకపోవడం.. ఆహార ప్రాధాన్యతలు , వ్యాయామ నియమాలతో సహా అనేక వ్యక్తిగత సమస్యలను చర్చించారు. "నువ్వు ఎప్పుడైనా పెళ్లి చేసుకోబోతున్నావా? పెళ్లి కాదా?" ఇంటర్వ్యూయర్ అడిగాడు. దానికి ఆసక్తికరంగా స్పందించాడు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలన్న దానిపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మంచి లక్షణాలున్న మహిళ అయితే అభ్యంతరం లేదని రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. అయితే ఆ లక్షణాలేంటో మీ దగ్గర చెక్ లిస్ట్ ఉందా? అని ఇంటర్వ్యూయర్ రాహుల్ ను అడగగా.. ‘మంచి లక్షణాలుంటే చాలు’ అని బదులిచ్చాడు.

భారతదేశం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో జాబితా ఒకరైన రాహుల్ గాంధీ.. తను వివాహానికి వ్యతిరేకం ఏమీ కాదని చెప్పాడు. "సరైన అమ్మాయి వస్తే.. పెళ్లి చేసుకుంటాను. అంటే ఆమె వెంట వస్తే.. బాగుంటుంది అనేలా ఉండాలి." అన్నాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నితిన్ అగర్వాల్, ట్విట్టర్‌లో వీడియో క్లిప్‌ను పంచుకుంటూ, "కర్లీ టేల్స్ కామియా జానీతో వివాహంపై రాహుల్ గాంధీ చిట్-చాట్" అని ప్రకటించారు.

మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తికి ఎలాంటి లక్షణాలుండాలంటే.. అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ "తెలివిగల ప్రేమగల వ్యక్తి" అని బదులిచ్చారు.

52 ఏళ్ల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్, "నా తల్లిదండ్రులు నిజంగా మనోహరమైన వివాహం చేసుకున్నారు. వారు పూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు కాబట్టి నా కు అంతకుమించిన ప్రేమ ఉండాలని ఉంది" అని తన తల్లిదండ్రులు రాజీవ్ మరియు సోనియా గాంధీని ఉద్దేశించి అన్నారు.

కాంగ్రెస్ నాయకుడు 129 రోజుల్లో 12 రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన తర్వాత జమ్మూలోకి ప్రవేశించారు. సెప్టెంబర్ 7న తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో జనవరి 30న గాంధీ తన పార్టీ ప్రధాన కార్యాలయంలో మెగా ర్యాలీలో జాతీయ జెండాను ఎగురవేయడంతో ముగియనుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.