ఎవరికి ఎవరూ తగ్గెదేలె: ఆర్ఆర్ఆర్ వర్సెస్ విజయసాయి

Mon Jan 17 2022 16:03:53 GMT+0530 (India Standard Time)

Raghu Rama Krishnam Raju Vs Vijay Sai Reddy

సంచలన ట్వీట్ చేశారు నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ. మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలోనే కాదు.. తనను టార్గెట్ చేసినోళ్లు ఎవరైనా.. ఎంతటి వారైనా సరే తగ్గేదేలే.. అన్నట్లుగా వ్యవహరించే తీరు రఘురామలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. తరచూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. సంచలనంగా మారిన రఘురామ మీద.. సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమ వేళ.. ఊహించని రీతిలో ట్వీట్ పోస్టు చేశారు.ఇటీవల కాలంలో ఎంపీ రఘురామ చేసిన వ్యాఖ్యలు.. పోస్టు చేసిన ట్వీట్లను చూసినప్పుడు.. మాంచి ఆకలి మీద ఉన్న పులి తన అవసరాన్ని తీర్చుకోవటానికి ఎంతలా ప్రయత్నిస్తుందో.. ఇంచుమించుగా.. తనను అదే పనిగా టార్గెట్ చేసే విషయంలో ఆయన వెంటాడే తీరు సరిగ్గా ఇదే తీరును పోలి ఉంటుంది. ఇదిలా ఉంటే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి..తాజాగా రఘురామ రాజుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టిన ట్వీట్లు దుమారంగా మారాయి.

సాటి పార్లమెంటు సభ్యుడనే కన్నా గౌరవ మర్యాదల్ని పక్కన పెట్టేసి.. రాజకీయ ప్రత్యర్థిపై ఎలా అయితే విరుచుకుపడతార.. ఇంచు మించే అదే టోన్ లో రియాక్టు అయ్యారు. ఆయన ఏమన్నారన్నది ఆయన ట్వీట్ లోనే చూస్తే.. ''గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని 'నన్ను చంపేస్తారు' అని ఏడుపు మొదలెట్టాడు. నర్సాపురం ప్రజలకు మొహం చూపించలేకే ఈ పబ్లిసిటీ స్టంట్. చీప్ పబ్లిసిటీ వస్తుందంటే చివరకు గోదాట్లోకైనా దూకి నన్ను ఎవరో తోసేశారు అనే రకం'' అంటూ ఆర్ఆర్ఆర్ మీద ఘాటైన ఆరోపణతో కూడిన విమర్శ చేశారు.

తనను అన్నేసి మాటలు అన్న ఎంపీ విజయసాయి రెడ్డికి దిమ్మ తిరిగేలా రఘరామ కౌంటర్ ట్వీట్ చేశారు. పజాసేవలో ఉన్న వేళలో.. అందరి ఆమోదం ఏ నేతకు అలవాటు కాదు. అందుకే రాజకీయాల్లో ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వచ్చి తిట్టే తీరు  మామూలే. అయితే.. ఇలాంటి వాటి విషయంలో కొందరు మౌనంగా ఉంటే.. మరికొందరు మాత్రం తనను అన్న వారికి అసలుతో పాటు.. వడ్డీని కూడా కలిపి ఇస్తుంటారు. తాజాగా ట్విటర్ లో విజయసాయి రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు

''వీడిని విశాఖ నుంచి గెంటేసి అండమాన్ కి పంపిస్తే మళ్ళీ వచ్చేసాడు. ఎన్ని సార్లు ముఖ్యమంత్రి చేతిలో తన్నులు తిన్నా సిగ్గులేదు వీడికి. రేపో మాపో వీడు కూడా నా దారి పడతాడు. Let us wait and see!'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా ఎవరికి వారు వారికి తోచిన రీతిలో రియాక్టు అవుతున్న వైనం ఇప్పుడు మరిన్ని సంచలనాలకు కారణమవుతోంది.