ఆర్టీఏ ప్రశ్న.. మోడీ భారతీయుడేనా.?

Fri Jan 17 2020 17:13:43 GMT+0530 (IST)

RTI Filed To Know Whether PM Modi Is An Indian Citizen

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) మంటలు చల్లారేలా కనిపించడం లేదు. దేశంలోని 22 ప్రతిపక్ష పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు  దీన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయమని తీర్మానించాయి.మోడీ సీఏఏను ఖచ్చితంగా రాష్ట్రాలన్నీ ఆమోదించేలా కఠిన చట్టాలు తీసుకురావడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో మోడీ టార్గెట్ గా ఓ కేరళ వాసి సంచలన విషయాన్ని ఆర్టీఐ ద్వారా అడగడం కలకలం రేపింది.

కేరళలోని త్రిసూర్ జిల్లా చలక్కుడికి చెందిన జోస్ కలువేట్టిల్ అనే వ్యక్తి సమాచార హక్కు ద్వారా తాజాగా ఓ దరఖాస్తు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ భారతీయుడే అనడానికున్న  ఆధారాలు ఏంటో చూపించాలని కోరాడు. సమాచారం సేకరిస్తామని అధికారులు దరఖాస్తు దారుడికి సమాధానం ఇచ్చారు. ఈ దరఖాస్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీజేపీ శ్రేణులు దీనిపై ఫైర్ అవుతున్నాయి.

సీఏఏ ఎన్నార్సీల ద్వారా ముస్లింలు మాత్రం దేశంలోకి ప్రవేశించకుండా నిబంధనలు పెట్టడంతో  దీనిపై సీరియస్ అయిన ఈ యువకుడు ఈ చట్టాలు జాతీయత మీద ఆధారపడి ఉండడంతో మోడీని టార్గెట్ చేస్తూ ఈ ప్రశ్న అడగడం సంచలనంగా మారింది.