కండక్టర్లు మద్యం అమ్మాల్సిందేనా?

Sun May 31 2020 12:39:48 GMT+0530 (IST)

RTC couductors may superwise wine shops in Andhra

మహమ్మారి దెబ్బకు ప్రజా రవాణా బంద్ అయిపోయింది. ఇటీవలే లాక్ డౌన్ సడలింపులతో పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులను తెరిచారు. అయితే టికెట్లు బస్సులో తీసుకుంటే కరోనా వ్యాపిస్తుంది కనుక.. బస్టాండ్లలోనే టికెట్లు తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఎవరూ ఎక్కడ దిగాలో అన్నీ బస్టాండ్లలోనే తీసుకోవాలి. దీంతో కండక్టర్లు అంతా ఖాళీ అయిపోతున్నారు. వారికి పనిలేని స్థితి ఎదురవుతోంది.దీంతో బస్ కండక్టర్లను ఏం చేయాలనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వారికి ప్రభుత్వ మద్యం షాపుల డ్యూటీ వేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

ఏపీలో మద్యం షాపులన్నీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి. కొన్ని మద్యం దుకాణాల్లో అవకతవకలు జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆర్టీసీలో అదనంగా ఉండే కండక్టర్లను డిప్యూటేషన్ పై బేవరేజేస్ కార్పొరేషన్ కు పంపితే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.

కండక్టర్లకు సూపర్ వైజర్లుగా పోస్టు ఇచ్చి ప్రభుత్వ మద్యం షాపుల్లో నియమించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే ప్రభుత్వం ముందు అధికారులు పెట్టనున్నారు.