చూశారా మోడీ సర్! కాకరేపుతున్న ఆర్జీవీ ఇన్‌స్టా పోస్ట్

Sun May 09 2021 19:11:40 GMT+0530 (IST)

RGV sensational post with India Today cover story

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ).. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు సంచలనం రేపుతోంది. దేశంలో ప్రతిష్టాత్మక మ్యాగజైన్.. ఇండియా టుడే ముఖచిత్రంపై వచ్చిన వార్తను తన ఇన్ స్టా గ్రామ్‌లో పోస్టుచేసిన రామ్‌గోపాల్ వర్మ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి.. సీరియస్ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి మరిన్ని కామెంట్లు వీక్షకుల నుంచి తోడవుతుండడం గమనార్హం.ఇదీ జరిగింది!

ప్రస్తుతం .. దేశంలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడా ఏ రాష్ట్రంలో నూ పరిస్థితి ఆశాజనకంగా లేదు. వేల సంఖ్యలో కరోనా బాధితులు మృత్యువాత పడుతున్నారు. అయితే.. తొలిదశ సమయంలో అంటే.. గత ఏడాది తీసుకున్న జాగ్రత్తల్లో పదిశాతం కూడా తాజగా వచ్చిన సెకండ్ వేవ్ విషయంలో మోడీ సర్కారు తీసుకోలేదని.. అందుకే ఏ రాష్ట్రం కూడా ప్రశాంతంగా లేదని పేర్కొంటూ.. `ఇండియా టుడే` అనేక వ్యాసాలు కథనాలు ప్రచురించింది. దీనంతటికీ.. మోడీ సర్కారు జిమ్మిక్కులు.. విఫలమైన విధానాలే కారణమంటూ ఏకిపారేసింది.

భీతి గొలిపే ముఖచిత్రం!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా జరుగుతున్న మరణాలతో శ్మశానాలు నిండిపోవడం... యూపీ సహా ఢిల్లీ శ్మశానాల్లో `నిండిపోయాయనే` బోర్డులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ శ్మశానం వద్ద మృత దేహాలను అంతిమ సంస్కారం కోసం క్యూలో పెట్టిన ఫొటోను..(దీనిలో శవాలు వరుసలో కిందన పేర్చబడి ఉన్నాయి) ఇండియా టుడే ముఖ చిత్రంగా ప్రచురింది.
అంతేకాదు..

`కొవిడ్ 2.0
విఫల దేశం
ఎవరిని నిందించాలి?
ఏం చేయాలి?

అనే ముఖ శీర్షికతో వచ్చిన కథనం తాలూకు.. పోస్టును ఆర్జీవీ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతేకాదు.. ఈ పోస్టులో ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా ప్రశ్నించారు.. ఆర్జీవీ.. ``మీరు చూశారా సార్..`` అంటూ ప్రధాని నరేంద్ర పేరును ట్యాగ్ చేయడం గమనార్హం. ఇక దీనిని 22234 మంది లైక్ చేయడం విశేషం.