Begin typing your search above and press return to search.

పోలీస్ వాళ్లను అంటారా? అయ్యన్ననోరు సబ్బు పెట్టి కడగాలి: వర్మ

By:  Tupaki Desk   |   29 Jan 2023 11:13 AM GMT
పోలీస్ వాళ్లను అంటారా? అయ్యన్ననోరు సబ్బు పెట్టి కడగాలి: వర్మ
X
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మరోసారి ఆగ్రహం తన్నుకొచ్చింది. నిన్న రాత్రి ఓ సెల్ఫీ వీడియో తీసుకొని పోలీసులను తిట్టిన టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అసలు అంత తిడుతుంటే పోలీస్ డిపార్టెంట్ మెంట్ ఏం చేస్తున్నారని.. అలా ఎలా ఊరుకుంటున్నారని వర్మ కాస్త గట్టిగానే నిలదీశారు. అసలు వివాదాలకే కేరాఫ్ అడ్రస్ మన వర్మ అని అందరూ విమర్శిస్తుంటారు. కానీ ఈయన నోరుజారిన టీడీపీ నేతలపై నోరుపారేసుకోవడమే వింత అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

ఇంతకీ మన వర్మ రాత్రి సెల్ఫీ వీడియోలో అసలు ఏమన్నాడంటే.. ‘‘ఇంకోడు అయ్యన్నపాత్రుడు.. పురాణాల్లాటి పేరు.. పోలీసులపై ఈయన చేసిన కామెంట్స్ కు నోరు సబ్బు పెట్టి కడగాలి. నేను పోలీస్ డిపార్ట్ మెంట్ ను నిజంగా అడుగుతున్నాను.. ఇలాంటివాళ్లు అలాంటి మాటలతో దూషిస్తుంటే పోలీసులకు ఎవరు గౌరవం ఇస్తారు? ఎందుకు ఇవ్వాలి? మీమీద మాకు నమ్మకం పోదా? ఇలాంటి వారికి కూడా మీరు సమాధానం చెప్పలేకపోతే సొసైటీలో ఉన్న మాలాంటి కామన్ పీపుల్ ను ఎలా రక్షించగలుగుతారు? ఎలా ఒక సెక్యూర్ వాతావరణం సృష్టించగలరు’ అంటూ వర్మ ప్రశ్నించారు.

పోలీస్ అధికారులందరికీ ఈ సందర్భంగా వర్మ వీడియోలో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి జరగకుండా చూడాలని.. పోలీసు వారికి ఆత్మగౌరవం ఉండాలని సూచించారు. మేం పోలీస్ డిపార్ట్ మెంట్ ను చాలా రోజులుగా గౌరవంగా చూస్తున్నామని.. ఇప్పటి లీడర్లు.. ఇంతకుముందు లీడర్లు.. లీడర్లు అవ్వబోయే వారంతా ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే పోలీసులకు గౌరవం ఎలా ఉంటుంది? ఎవరు ఇస్తారు? అంటూ వర్మ ప్రశ్నల వర్షం కురిపించారు.

పోలీసులు ఈ విషయంలో సీరియస్ గా స్పందించాలని.. అయ్యన్నపాత్రుడు, అచ్చెంనాయుడు వీళ్లందరికీ బుద్ది వచ్చేటట్టు ఏదో ఒకటి చేయాలని వర్మ కోరారు. దయచేసి పోలీసువారికి విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏ రాజకీయ నాయకుడు అయినా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి.. మాట్లాడాలి అని వర్మ సూచించారు. షూట్ అండ్ సైట్ ఆర్డర్ వేయడానికి టీడీపీ నేతలు ఎవరు అంటూ వర్మ ప్రశ్నించారు. ఇలాంటి మాటలు నార్మల్ ఫిల్మ్ మేకర్ గా తానూ మాట్లాడనంటూ చెప్పుకొచ్చాడు. పోలీసులు ఒక రెస్పెక్టెడ్ డిపార్ట్ మెంట్ అయ్యిండి ఇలాంటి వ్యాఖ్యలను ఉపేక్షించవద్దని వర్మ తన వీడియోలో కోరారు.