కేఏపాల్ ను కలిసిన అమిత్ షా.. ఎద్దేవా చేసిన రాంగోపాల్ వర్మ

Sat May 14 2022 06:00:01 GMT+0530 (IST)

RGV On KA Paul Amit Shah Meeting

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ జోకర్ అయిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవడం ఏంటని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎద్దేవా చేశారు. అమిత్ షా మాట్లాడిన కామెడీ పంచిన వీడియోలు అసలు అమిత్ షా చూశాడా? చూశాక ఆయనను కలవాలని అనిపించిందా? అని వర్మ సైటెర్లు వేశారు.కేఏ పాల్ కామెడీ పంచిన 100 వీడియోలను పంపిస్తానని.. అవి చూశాక అయినా కేఏపాల్ ను 'ప్రపంచంలోనే బిగ్గెస్ట్ జోకర్' అని అంటారని వర్మ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఈ మీటింగ్ మరోసారి జరిగితే నేను చస్తాను అంటూ వర్మ కామెంట్లతో విరుచుకుపడ్డారు.

2019 ఎన్నికల సందర్భంగా ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన కేఏపాల్ చేసిన హడావుడి అంతా ఇంతాకాదు.. ఆయన చేసిన సీరియస్ కామెడీని జనాలు తెగ ఎంజాయ్ చేశారు. ఇక వర్మ అయితే కేఏ పాల్ ను ప్రతి సారి విమర్శిస్తూనే ఉన్నారు.

కరోనా టైంలోనూ వర్మ చాలా ట్వీట్లు చేసి కేఏ పాల్ ను వాడుకున్నారు. 'కేఏ పాల్.. ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కద.. నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మా' అంటూ కేఏ పాల్ పై వర్మ సెటైర్లు వేశారు. ఈ పోస్టు అప్పట్లో సోషల్ మీడియాతో  వైరల్ అయ్యింది.

ఇక అమిత్ షాను కలిశాక కేఏ పాల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ల అవినీతి ఇక ఏమాత్రం చెల్లదని కేఏ పాల్ అన్నారు. ఈ తండ్రీకొడుకులు తనపై తెలంగాణలో దాడి చేయించినందుకు త్వరలోనే ఈ ఇద్దరూ ఫలితం చూడబోతున్నారని.. దీనిపై అమిత్ షాకు ఫిర్యాదు చేశానని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ కు మూడిందని అన్నారు.