Begin typing your search above and press return to search.

డిజిటల్ రుణాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   14 Jan 2021 5:40 AM GMT
డిజిటల్ రుణాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం
X
తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో డిజిటల్ రుణం తీసుకొని ఆ కంపెనీ పెట్టే అవమానం తట్టుకోలేక ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ లోనూ డిజిటల్ రుణానికి పలువురి ప్రాణాలు పోయాయి. దేశవ్యాప్తంగా యాప్ లు, సంస్థలు వినియోగదారులకు రుణాలు వారి ఉసురుతీస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న డిజిటల్ రుణాల దారుణాలను నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. దీనిపై అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. రుణయాప్ లు, ఇతర డిజిటల్ రుణాలను ఈ గ్రూపు పరిశీలిస్తుంది. డిజిటల్ రుణాల లోటుపాట్లపై అధ్యయనం చేస్తుంది.

డిజిటల్ రుణాల వల్ల మేలుతోపాటు అనర్థాలు పొంచి ఉన్నాయని.. దీన్ని సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ తెలిపింది. డేటా భద్రత, ప్రైవసీ, విశ్వసనీయత వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం నియమ నిబంధనలు తయారు చేయాలని ఆర్బీఐ ప్రకటనలో పేర్కొంది.

డిజిటల్ రుణాలు ఇచ్చే వేదికలు, మొబైల్ యాప్స్ వాడకం వల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నాయని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యలను నివారించేందుకు వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ గ్రూపు డిజిటల్ రుణాల లోటుపాట్లను అధ్యయనం చేస్తుందని తెలిపింది.