టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ : పెన్ డ్రైవ్ లో ఏకంగా 15 పేపర్లు గుర్తింపు

Fri Mar 31 2023 16:02:53 GMT+0530 (India Standard Time)

Question Papers in Pen Drive in TSPSC Paper Leak

తెలంగాణ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడి ప్రశ్నపత్రాలను లీక్ చేసి లబ్ధి పొందిన వారి ఆట కట్టైంది. టీఎస్.పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ సంచలనం సృష్టించిన కేసులో తాజాగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. తాజాగా విచారణలో నిందితుల పెన్ డ్రైవ్ లో ఏకంగా 15 ప్రశ్న పత్రాలను సిట్ గుర్తించడం అందరినీ షాక్ కు గురిచేసింది.గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏఈఈ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ డీఏవో జనరల్ స్టడీస్ మ్యాథ్స్ ఏఈ జనరల్ స్టడీస్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ పేపర్లు ఏఈ సివిల్ ఎలక్ట్రికల్ పేపర్ 2 టౌన్ ప్లానింగ్ జులైలో జరగాల్సిన జేఎల్ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్ డ్రైవ్ లో లభ్యమయ్యాయని సిట్ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 15మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. లక్షల్లోనే డబ్బులు చేతులు మారినట్టుగా సిట్ దర్యాప్తులో తేలింది.

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న టీఎస్.పీఎస్సీ కేసులో ఈడీ కూడా రంగంలోకి దిగుతోంది. ప్రశ్నపత్రాల లీకేజీపై రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోనుండడం గమనార్హం.

అనధికార ఆర్థిక లావాదేవీ జరిగినట్టు కానీ.. దాని ద్వారా ఆస్తులు సమకూర్చుకున్నట్లు కానీ ప్రాథమిక ఆధారాలు లభించే పక్షంలో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అధికారం ఈడీకి ఉంటుంది. దీని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ప్రశ్నపత్రం కేసు నమోదు చేయబోతోంది.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)   పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపించిన ప్రతిపక్ష నేతలు బండి సంజయ్ రేవంత్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.

ఇప్పటికే  వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారించారు.  బండి సంజయ్ లేఖ రాశారు. ఇప్పుడు నిందితులను కూడా విచారిస్తూ కేసును నిగ్గు తేల్చే పనిలో పడ్డారు.      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.