21 ఏళ్ల చిన్నోడితో పుతిన్ మాజీ భార్య పెళ్లి ?

Mon Feb 01 2016 01:00:02 GMT+0530 (IST)

Putin ex-wife marries toy boy 21 years younger

రష్యాలో తిరుగులేని రాజకీయ నేతగా.. అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పుతిన్ కు సంబంధించిన ఒక అంశం ఇప్పుడా దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు మూడేళ్ల క్రితం పుతిన్ తో సంబంధాలు కట్ చేసుకొని విడాకులు తీసుకున్న ఆయన భార్య లిద్మిలా తాజాగా పెళ్లి చేసుకున్నారన్నది ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. దాదాపు 30 ఏళ్ల పాటు పుతిన్ తో దాంపత్య జీవితాన్ని సాగించిన ఆమె అధికారిక విడాకుల అనంతరం.. పెళ్లి చేసుకున్నారన్నది సంచలనంగా మారింది.అయితే.. ఈ పెళ్లికి సంబంధించి అధికారిక ఆధారాలు ఏమీ లేనప్పటికీ.. రష్యాకు చెందిన ఒక మీడియా సంస్థ తన కవర్ పేజీపై భారీ కథనం ప్రచురించింది. పెళ్లి నేపథ్యంలో ఆమె తన పేరును మార్చుకుందని చెబుతున్నారు. పుతిన్ మాజీ సతీమణి లిద్మిలా పుతిన్.. తన పేరును లిద్మిలా ఓకెరెత్నాయా అని మార్చుకున్నారని చెబుతున్నారు. ఇదే  పేరుతో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సంచలన పెళ్లిలో మరో విశేషం ఏమిటంటే.. 58 ఏళ్ల లిద్మిలా.. తనకంటే 21 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తిని పెళ్లాడటం. అర్తుర్ ఓకెరెత్నీ అనే 37 ఏళ్ల బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకున్నట్లుగా రష్యా మీడియా సంస్థ ఒకటి వెల్లడించింది. అయితే.. తమ కథనంలో పెళ్లికి సంబంధించిన ఎలాంటి అధికారిక ఆధారాలు చూపించకపోవటం గమనార్హం.