బంగారు మాస్కు..ఖరీదు రూ.3లక్షలు..పని విషయంలో డౌటే

Mon Jul 06 2020 05:00:01 GMT+0530 (IST)

Pune Man Wears Mask Made Of Gold Worth Nearly Rs. 3 Lakh

పరిస్థితులకు తగ్గట్లు మార్పులు చేసుకోవటం మామూలే. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారికి చెక్ చెప్పేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆ ప్రయోగాల ఫలితాలు ఒక కొలిక్కి వచ్చింది లేదు. ఈ నేపథ్యంలో వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరూ ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి. ఇలాంటివేళ.. ఒక వ్యక్తి మిగిలిన వారికి భిన్నంగా వ్యవహరించారు. అంతే.. అతగాడు ఇప్పుడు కొత్త ఆలోచనతో అందరిని ఆకర్షిస్తున్నాడు.మహమ్మారి మనవరకూ రాకుండా ఉండేందుకు భౌతిక దూరాన్ని పాటించటం.. ముఖానికి మాస్కుపెట్టుకోవటం. ఇలా పెట్టుకునే దాంతో తన క్రియేటివిటీని ప్రదర్శించాడో వ్యాపారి. తన ముఖాన్ని కప్పేసేలా వినూత్నంగా బంగారుకు మాస్కును తయారు చేయించాడు. దాని విలువ ఏకంగా రూ.2.89లక్షలుగా చెబుతున్నారు.

ఇప్పుడీ బంగారు మాస్కు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ గా మారింది. మహారాష్ట్రలోని పింప్రి చింద్వాడ్ కు చెందిన శంకర్కురాడే చేసిన వినూత్న ప్రయోగం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అయితే.. ఇంత ఖరీదైన మాస్క్ పరువు తీసే మాట ఒకటి ఆయన చెబుతున్నారు.

ఈ బంగారు మాస్కు ద్వారా ఊపిరి ఆడేందుకు వీలుగా.. మాస్కుకు కన్నాలు అమర్చారు. అయితే.. ఇంత ఖరీదు పెట్టి తయారు చేయించుకు వాటితో ప్రయోజనం ఎంతన్నది చూ్తే షాకింగ్ నిజం బయటకు వచ్చింది. ఈ మాస్కు వల్ల ప్రయోజనం ఎంతన్నది తనకు తెలీదని.. తయారీ విషయంలో పక్కాగా ఉన్నట్లు తేలుతుంది. ప్రచారమే తప్పించి మరింకే ప్రయోజనం లేని ఈ బంగారు మాస్కులతో ముప్పేనని హెచ్చరిస్తున్నారు. షోకు కోసం పెట్టుకునే ఈ బంగారు మాస్కును అదే పనిగా వాడేస్తే.. మహమ్మారి మీద పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే ఉండదన్న మాటను చెబుతున్నారు.