Begin typing your search above and press return to search.
బెంగళూరులో హడలెత్తిస్తున్న పంక్చర్ మాఫియా!
By: Tupaki Desk | 30 May 2023 7:00 PMడ్రగ్స్, గ్రావెల్, మద్యం వంటి మాఫియా గ్యాంగ్‌ల గురించి ఇప్పటి వరకు మనం విని ఉంటాం. అయితే ఇప్పుడు ఇండియన్ సిలికాన్ వ్యాలీగా గుర్తింపు పొందిన బెంగళూరులో పంక్చర్ మాఫియా బెంబేలెత్తిస్తోంది. రోడ్లుపై తమ వాహనాలు ఒకటి, రెండు కిలోమీటర్లు వెళ్లగానే పంక్చర్ అవుతున్నాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు.
పంక్చర్ పడటంతో వాహనాదారులు చేసేదేమీ లేక పంక్చర్ దుకాణాలకు పరుగెడుతున్నారు. ఈ పంక్చర్ దుకాణాలు కూడా ఎక్కువ దూరంలో ఉండటం లేదు. పంక్చర్ పడిన చోటకు కూతవేటు దూరంలోనే ఉండటం గమనార్హం. బెంగళూరులో ఇలా ఒకరిద్దరికి కాదు. నిత్యం కొన్ని వందల మందికి ఇదే పరిస్థితి తలెత్తుతోంది.
బెంగళూరులో రోడ్లు బాగోక పంక్చర్లు పడుతున్నాయని అనుకుంటున్నారు కదూ.! అయితే కారణం రోడ్లు కాదు. దీని వెనుక బెంగళూరు నగరంలో పంక్చర్ మాఫియా హస్తం ఉందని తెలుస్తోంది.
ఈ పంక్చర్ మాఫియా పని ఏమిటంటే... పంక్చర్ షాప్ ఉన్న ప్రదేశాల్లోని రోడ్లు, సర్కిల్స్ వద్ద ఇనుప కమ్మీ మేకులు వేసి వాహనాలను పంక్చర్ చేస్తున్నారు. దీంతో వాహనదారులు వారి షాపుల వద్దకు పంక్చర్లకు వేయించుకోవడానికి వెళ్తున్నారు. దీంతో ఒక్కో ఒక పంక్చర్‌కు కనీసం రూ.80 రూపాయలు తీసుకుంటున్నారు. ఒకవేళ మూడునాలుగు పంక్చర్లు అయితే కనీసం రూ.250, 300 వసూలు చేస్తున్నారు. ఇలా కావాలనే పంక్చర్లు చేస్తూ చేతుల నిండా డబ్బులు సంపాదిస్తోంది.. పంక్చర్ల మాఫియా.
ఈ పంక్చర్ల మాఫియా ప్రస్తుతం బెంగళూరు ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చీటికి మాటికి వాహనాలు పంక్చర్ అవుతుండటంతో ప్రజలు రోడ్డు ఎక్కాలంటేనే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నగరంలోని అశోకనగర ప్రాంతంలో వాహనాలు తరచూ పంక్చర్ అవుతున్నాయి. పంక్చర్ షాపులు దగ్గర్లో ఉన్న చోటే ఇలా జరుగుతుండటం ఇదంతా పంక్చర్ల మాఫియా పనేనని అర్థమవుతోంది. ఆ ప్రాంతంలోని రోడ్లపై మేకులు కుప్పలుతెప్పలుగా కనిపిస్తుండటంతో ఇది పంక్చర్ మాఫియా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
పంక్చర్ మాఫియాలోని వ్యక్తులు బెంగళూరు నగరంలోని తమ దుకాణానికి ఒక కిలోమీటర్ దూరంలో రోడ్లపై, కూడళ్ల వద్ద మేకులు, ఇతర పదునైన వస్తువులను పడేస్తున్నారు. అవి గుచ్చుకోగానే వాహనాల టైర్లు, ట్యూబులు పంక్చర్ అవుతాయి. ఫలితంగా పమీపంలోని షాపుల్లో పంక్చర్ చేయించుకునేందుకు వాహనదారులు క్యూ కడుతున్నారు. దీంతో కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు.
బెంగళూరు నగరంలోని అనేపాళ్య, నంజప్ప కూడలి, అపేరా జంక్షన్ తదితర ప్రాంతాల్లో పోలీసులు తరచూ కిలోకుపైగా మేకులు, ఇనుప తీగలను సేకరిస్తుండటం పంక్చర్ల మాఫియాకు తీవ్రతకు అద్దం పడుతోంది. రహదారులు, దత్తపీఠానికి వెళ్లే మార్గంలోనే మేకులు వేసే మాఫియా ఉందని పోలీసులు గుర్తించారు. ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తేనే ఈ మాఫియా ఆట కట్టించగలమని అశోకనగర ఠాణా ట్రాఫిక్ ఎస్సై మహ్మద్ ఇమ్రాన్ అలీ చెబుతున్నారు.