Begin typing your search above and press return to search.

వ్యభిచారం గృహం గుట్టురట్టు..హైదరాబాద్ టు పశ్చిమబెంగాల్

By:  Tupaki Desk   |   24 May 2020 6:10 AM GMT
వ్యభిచారం గృహం గుట్టురట్టు..హైదరాబాద్ టు పశ్చిమబెంగాల్
X
వివిధ దేశాల నుంచి యువతులను అక్రమంగా తీసుకొచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివిధ దేశాల మహిళలు.. పైగా అక్రమంగా వచ్చిన వారు కావడంతో ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ ఐఏ) విచారిస్తోంది. ఈ క్రమంలోనే మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ ఘటన హైదరాబాద్‌ పాతబస్తీలోని ఛత్రినాకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పాతబస్తీలోని ఓ వ్యభిచార గృహంపై ఏప్రిల్‌ 21వ తేదీన పోలీసులు దాడిచేసి పశ్చిమబెంగాల్ కు చెందిన ముగ్గురు నిర్వాహకులు మహ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌ - అతడి భార్య బితిబేగం - సోజిబ్‌‌ లను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో అంతర్జాతీయ వ్యభిచార ముఠాల పాత్ర ఉన్నట్లు తేలడంతో ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. దర్యాప్తులో భాగంగానే బంగ్లాదేశ్ జాతీయురాలు శివులి ఖటూన్‌ను అరెస్టు చేశారు. ఆమె 2012లో దేశంలోకి అక్రమంగా చొరబడింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి యువతులను అక్రమంగా తీసుకొస్తోంది. ఈ వ్యవహారంలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఎన్ ఐఏ గుర్తించింది.

పోలీసుల దాడితో ముగ్గురు యువతులకు వ్యభిచారం బందీ నుంచి విముక్తి కలిగింది. బంగ్లాదేశ్‌ నుంచి యువతుల్ని అక్రమంగా భారత్‌ లోని వ్యభిచార గృహాల నిర్వాహకులకు తరలించడంలో కీలకంగా ఉన్న రుహుల్‌ అమిన్‌ దాలి (52)ని శుక్రవారం ఎన్‌ ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌ లోని ఉత్తర 24 పరగణాల జిల్లా బసీరత్‌ పట్టణంలో తలదాచుకున్న అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 11 సిమ్‌కార్డులు (5 బంగ్లాదేశ్‌ వి), రూ.10వేల బంగ్లా కరెన్సీ - సెక్స్ రాకెట్ నిర్వాహకుల నంబర్లతో కూడిన డైరీని స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్ ఐఏ స్థానిక పోలీసుల సహకారంతో విచారణ చేస్తోంది. ఆ డైరీ ద్వారా మరికొన్ని వ్యవహారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.