Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి కష్టాలు! దెబ్బ మీద దెబ్బ ఏంటిలా?

By:  Tupaki Desk   |   20 March 2023 4:00 PM GMT
బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి కష్టాలు!  దెబ్బ మీద దెబ్బ ఏంటిలా?
X
ఉన్నట్లుగా ధీమాను వ్యక్తం చేయటమే తప్పించి.. తెలంగాణకు తమకు మించిన చాంఫియన్లు మరెవరూ లేరన్నట్లుగా చెప్పే గులాబీ దళానికి ఇప్పుడు నోట మాట రాని పరిస్థితి. ఏదైనా ఉదంతం జరిగినంతనే విపక్షాల తీరుపై తీవ్రంగా స్పందించే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి చొప్పున తెర మీదకు వస్తున్న ఉదంతాలు గులాబీ శ్రేణులకు షాకుల మీద షాకులు అన్నట్లుగా మారుతున్నాయి.

గడిచిన తొమ్మిదేళ్లలో ఎప్పుడూ ఇంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నది లేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తోంది. టీఆర్ఎస్ పేరును కాస్తా బీఆర్ఎస్ గా మార్చిన నాటి నుంచి ఈ కష్టాలు ఎక్కువ అయ్యాయన్న వాదాన్ని పలువురు వినిపించటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం వరకు పరిమితమైన వేళలో.. ఒక కంఫర్ట్ ఉండేదని.. ఇప్పుడది మిస్ అయ్యిందని.. ఏం చెప్పినా.. దానికి రివర్సులో వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నట్లుగా పేర్కొంటున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితపై ఆరోపణలు రావటం.. ఈడీ విచారణకు ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే.. ఇది సరిపోదన్నట్లుగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీల ఉదంతంలో మంత్రి కేటీఆర్ పేషీ మీద ఆరోపణలు రావటం.. ఇది కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారిందంటున్నారు.

ఇది సరిపోదన్నట్లుగా ఫాంహౌస్ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారన్న వ్యవహారంలో తగిలిన ఎదురుదెబ్బతో తగలిన గాయం నుంచి కోలుకోక ముందే రాచపుండు మాదిరి ఢిల్లీ లిక్కర్ స్కాం తెర మీదకు వచ్చిందని చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న మాట బలంగా వినిపిస్తుండటం తెలిసిందే.

ఇదే సమయంలో తెర మీదకు వచ్చిన పేపర్ల లీకేజీ వ్యవహారం మంత్రి కేటీఆర్ వైపు వేలెత్తి చూపేలా చేయటం.. ఆయన ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

దీనికి తోడు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణల్ని చూసినప్పుడు.. తమకు కాలం కలిసి రావటం లేదన్న భావన బీఆర్ఎస్ నేతల్లో ఎక్కువగా వినిపిస్తుండటం కనిపిస్తోంది. ఎప్పుడూ లేని రీతిలో ఇంతటి ప్రతికూల పరిస్థితుల్ని తాము ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదని వారు వాపోతున్నారు. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బల్ని చూస్తుంటే.. ఇంతకాలం సహకరించిన కాలం తమకు అనుకూలంగా లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నట్లుగా వారు పేర్కొనటం గమనార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.