దంపతుల మధ్య శృంగారం లేకపోతే చిక్కులేనా?

Sat Jul 02 2022 06:00:01 GMT+0530 (IST)

Problem to Not Have Romance Between Couples

మానవ జీవితం ఉరుకుల పరుగుల మయం అయిపోయింది. ఉదయం ఎనిమిది గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే ఆఫీసులో పని చేసి అలసి సొలసి ఇంటికి చేరుకునే సరికి రాత్రి పది గంటలు అవుతోంది. ఇక రాత్రి నైట్ డ్యూటీలు చేసే పురుషులు మహిళల సంగతి సరేసరి. ముఖ్యంగా మీడియా ఐటీ రంగాల ఉద్యోగులకు సమస్యలు ఎక్కువ. ఎందుకంటే వీరు రాత్రిళ్లు కూడా పనిచేయాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో దంపతుల మధ్య రొమాన్స్ శృంగారం కరువైపోతున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నెలకు ఒక్కసారి మాత్రమే అది కూడా మొక్కుబడిగా శృంగారంలో పాల్గొంటున్నారని పేర్కొంటున్నాయి. ఇక సెల్‌ఫోన్ దంపతుల మధ్య పెద్ద అవరోధంగా నిలుస్తోందని అంటున్నాయి. శృంగారం రొమాన్సు లేకపోవడం వల్ల కలిగే అనర్థాలు ఎన్నో తలెత్తుతాయని నిపుణులు కూడా చెబుతున్నారు.

డిప్రెషన్ పెరగడం వేరే అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులు కావడం దంపతులు ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం దీనివల్ల పిల్లలు మీద కూడా ఆ ప్రభావం పడటం సరైన నిద్ర పట్టకపోవడం ఫ్రస్టేషన్ పెరగడం అశ్లీల వీడియోలకు బానిస కావడం వివాహ జీవితం మీద విరక్తి తలెత్తడం దంపతులు ఒకరినొకరు నిందించుకోవడం వంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.   

శృంగార జీవితానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదని అని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల స్త్రీ కంటే పురుషులకే ఎక్కువ నష్టం కలుగుతుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి అసలు సమయం ఉండటం లేదని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శృంగారంలో పాల్గొంటే ఎన్నో కేలరీలు ఖర్చు అవుతాయని.. మరోవైపు డిప్రెషన్ ను కూడా దూరం చేసుకోవచ్చని అంటున్నారు.

శృంగారానికి దూరంగా ఉంటే రక్తప్రసరణ సరిగ్గా జరగక శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది అని అంటున్నారు. శృంగారం చేయని వారిలో ఒత్తిడి పెరిగి.. ఇది అనేక ఇతర రోగాలకు దారితీస్తుందట. ఇక దీర్ఘకాలం పాటు సెక్స్ కు దూరంగా ఉండే పురుషులకు వీటన్నింటితోపాటు అంగస్తంభన సమస్యలు కూడా తలెత్తుతాయని నిపుణులు బాంబు పేలుస్తున్నారు.