Begin typing your search above and press return to search.

ప్రియాంక ఎంట్రీ తప్పదా ?

By:  Tupaki Desk   |   26 March 2023 9:00 PM
ప్రియాంక ఎంట్రీ తప్పదా ?
X
ఇంతకాలం అవసరమైనపుడు మాత్రమే తెరమీదకు వస్తున్న ప్రియాంకగాంధి తొందరలో యాక్టివ్ పాలిటిక్స్ లొకి ఎంట్రీ తప్పేట్లులేదు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ళు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రింకోర్టు స్టే ఇవ్వకపోతే రాహూల్ కు జైలు జీవితం తప్పు.

ఇదే సమయంలో ఇప్పటికే ఎంపీగా అనర్హత వేటుపడింది. సుప్రింకోర్టు ఏ తీరున స్పందిస్తున్నది ఇపుడు చాలా కీలకమైపోయింది. కొట్టేస్తే సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ శిక్షను మొత్తంగా కొట్టేయాల్సుంటుంది.

లేదా శిక్ష రెండేళ్ళు అవసరంలేదు ఇంతచాలు అని అయినా చెప్పాలి. ఏదేమైనా కొంతకాలం రాహూల్ జనాలకు దూరంగా ఉండక తప్పేట్లు లేదు. శిక్ష తగ్గితే ఎంపీ అనర్హత వేటు నుండి తప్పించుకుంటారు. ఈ గ్యాప్ ను ఫిలప్ చేయటంకోసమే ప్రియాంక మరింత యాక్టివ్ అవ్వాల్సిన పరిస్ధితులు కనబడుతున్నాయి. సరిగ్గా ఇక్కడే అవసరమైతే రాహూల్ అనర్హత వేటు విషయం చర్చకు వస్తోంది. కేరళలోని వాయినాడ్ స్ధానం నుండి రాహూల్ గెలిచిన విషయం తెలిసిందే.

రాహూల్ గనుక ఆ స్ధానాన్ని ఖాళీ చేయాల్సొస్తే అక్కడి నుండి ప్రియాంక పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇప్పటికైతే లోక్ సభ సెక్రటేరియట్ వాయినాడ్ స్ధానం ఖాళీ అయిపోయిందనే ప్రకటించింది. దాన్ని న్యాయస్ధానం కన్ఫర్మ్ చేయాలంతే. నిజానికి ఇక్కడే లోక్ సభ సెక్రటేరియట్ ఓవర్ యాక్షన్ బయటపడింది. శిక్ష వధించిన కోర్టు నెలరోజులు నిలిపినపుడు లోక్ సభ సెక్రటేరియట్ కు మాత్రం అంత తొందరెందుకు ? శిక్ష తక్షణమే అమల్లోకి వస్తుందని కోర్టు చెప్పుంటే కథ వేరేవిధంగా ఉండేది.

ఈ నేపధ్యంలోనే నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపులు, వేధింపులకు దిగుతున్నట్లు దేశమంతా గోల మొదలైపోయింది. సో, ఉపఎన్నిక తప్పదంటే అక్కడి నుండి ప్రియాంకా గాంధి పోటీచేయటం ద్వారా డైరెక్టు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

ఇప్పటివరక ప్రియాంక పాత్ర పార్టీ ప్రచారానికి మాత్రమే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రియాంకను తెలంగాణాలోని మెదక్ నుండి పోటీచేయాలని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఆహ్వానించిన విషయం తెలిసిందే. తొందరలోనే ప్రియాంక ఎంట్రీ ఎక్కడినుండో తేలిపోతుంది.