జైల్లో ఒంటరిగా ఉన్నాడని ఖైదీకి సెక్స్ సుఖం ఇచ్చిందట!

Sun Oct 13 2019 07:00:02 GMT+0530 (IST)

ఊహకు అందని కొన్ని చోటు చేసుకుంటాయి. అలాంటివి విన్నంతనే.. నిజమేనా? అన్న భావన కలుగుతుంధి. ఒక హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీకి.. ఆ జైలుకు అధికారిణిగా ఉన్న ఇద్దరు పిల్లల తల్లి సెక్స్ చేయటం ఒక ఎత్తు అయితే..దాన్ని కోర్టులో ఆమె సమర్థించుకున్న తీరు అవాక్కు అయ్యేలా చేస్తుందని చెప్పాలి. ఇంతకీ ఈ చిత్రమైన ఉదంతం బ్రిటన్ లో చోటు చేసుకుంది.దుర్హమ్ కౌంటీలోని ఫ్రాంక్ లాండ్ జైలు అధికారిణి 39 ఏళ్ల రాచెల్ వెల్ బర్న్. ఆమెకు భర్త.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పద్నాలుగేళ్లుగా జైల్లో అధికారిణిగా పని చేస్తున్నారు. ఆమె భర్త కూడా జైలు ఆఫీసర్ గా పని చేస్తున్నారు. అయితే.. ఒక హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఒక ఖైదీతో ఆమె సెక్స్ సంబంధాన్ని కలిగి ఉండటం.. నిబంధనలకు విరుద్ధంగా ఖైదీ ఉండే గదిలో ఆమె సెక్స్ చేస్తూ అధికారులకు దొరికిపోయారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు.

తాను చేసిన పని తప్పేనని ఒప్పుకుంటూనే.. తాను ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయానికి చిత్రమైన వాదనను వినిపించారు. జైలు అధికారిణిగా ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావాల్సిన బాధ్యత తన మీద ఉందని.. అందులో భాగంగా అతనితో స్నేహంగా మెలిగానని.. అనుకోకుండా తమ మధ్య సెక్స్ సంబంధం ఏర్పడిందన్నారు. తాను లైంగిక సుఖం కోసం ఆ పని చేయలేదని.. సెక్స్ అనుభూతి కంటే కూడా ఖైదీకి సుఖం అందించాలన్న తాపత్రయంతోనే తానీ పని చేశానని చెప్పారు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న అతనికి సెక్స్ సుఖం అందే అవకాశం లేదని.. అందుకే అతడిలో మార్పు తెచ్చేందుకు తానీ పని చేశానని.. క్షమించాలన్నారు. తనకు ఎలాంటి శిక్ష విధించొద్దని.. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నందున.. వారి వ్యవహారాలు చూసుకోవాల్సిన బాధ్యత తన మీద ఉందన్నారు.

అయితే.. సదరు మహిళా అధికారిణి సెక్స్ చేసిన మామూలు ఖైదీ కాదని.. రెండో ప్రపంచ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన 87 ఏళ్ల ఫ్రాంక్ వర్సిలేను డబ్బుల కోసం హత్య చేశారని.. అలాంటి నేరస్తుడికి సెక్స్ అందించాల్సిన అవసరం లేదని జడ్జి అభిప్రాయ పడ్డారు. ఐదు యుద్ధ నౌకలకు నాయకత్వం వహించిన ఆ సీనియర్ అధికారి ఇంట్లో జొరబడి.. ఒంటరిగా ఉన్న అతడ్ని పిడిగుద్దులతో హింసించి డబ్బలు దోచుకుపోయాడని.. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మహిళా అధికారిణి చేసిన పనిని తప్పుగా తేలుస్తూ.. 12 నెలల జైలుశిక్షను విధించారు. మామూలుగా అయితే.. మరింత కాలం జైలు వేయాలని.. కానీ ఇద్దరు పిల్లలు ఉన్న కారణంగా స్వల్ప కాలం జైలుశిక్ష విధిస్తున్నట్లుగా తీర్పు చెప్పారు. ఈ ఉదంతం అక్కడ సంచలనంగా మారింది.