Begin typing your search above and press return to search.

మోడీనే నాలుగు మెట్లు దిగాలా ? టీం స్పూర్తి సాద్యమేనా ?

By:  Tupaki Desk   |   28 May 2023 12:00 PM GMT
మోడీనే నాలుగు మెట్లు దిగాలా ? టీం స్పూర్తి సాద్యమేనా ?
X
ఢిల్లీలో జరిగిన నీతిఅయోగ్ సమావేశంలో నరేంద్రమోడీ మాట్లాడుతూ దేశాభివృద్ధి కోసం అధికార-ప్రతిపక్షాలన్నీ కలిసి టీం ఇండియా స్ఫూర్తితో పనిచేయాలని పిలుపిచ్చారు. మోడీ ఆధ్వర్యంలో జరిగిన నీతిఅయోగ్ సమావేశాన్ని 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ టీం ఇండియా స్ఫూర్తితో పనిచేయాలని పిలుపిచ్చింది. మోడీ పిలుపివ్వటం వరకు బాగానే ఉంది కానీ దాన్ని ఆచరణలోకి తేవాల్సింది ఎవరు ? మొదటగా స్పూర్తిని ప్రదర్శించాల్సింది ఎవరు ? అన్నదే కీలకం.

అధికార, ప్రతిపక్షాలంతా కలిసి టీం ఇండియా స్పూర్తిగా పనిచేసి దేశాభివృద్ధికి కృషిచేయాలంటే ముందుగా చొరవ తీసుకోవాల్సింది మోడీయే. ఎందుకంటే కెప్టెన్ ఆలోచనలు, చర్యలు సరిగా ఉంటే టీం సభ్యులు కొద్దిరోజులకు దారికొస్తారు. ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టే ఇక్కడ కెప్టెన్ అంటే నరేంద్రమోడీనే. కాబట్టి మోడీయే నాలుగుమెట్లు దిగాల్సుంటుంది. ముందు ప్రతిపక్షాల నేతలకు మోడీ మర్యాదిస్తే వాళ్ళు కూడా మోడీని గౌరవిస్తారు. ఒకవైపు ప్రతిపక్షాల నేతలపై సీబీఐ, ఈడీ, ఐటిల్లో ఏదో ఒకదాని ద్వారా కేసులుపెట్టించి సతాయిస్తుంటే ఇక వాళ్ళు మోడీని ఎందుకు గౌరవిస్తారు.

తప్పు చేసిన వాళ్ళు ఎవరినీ వదలాల్సిన పనిలేదు. అందరిపైనా కఠినమైన చర్యలు తీసుకోవాల్సందే. అయితే ప్రతిపక్షాల నేతలు మాత్రమే తప్పులు చేస్తున్నారని, అధికార పార్టీ వాళ్ళు ఏమి చేసినా ఒప్పే అని అంటే ఎవరు అంగీకరించరు. ఒకవైపు బీజేపీయేతర పార్టీల ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. నేతలపైన కేసుల మీద కేసులు పెడుతు, విచారణ పేరుతో చావగొడుతున్నారు. తర్వాత అరెస్టులు చేసి జైళ్ళల్లో వేస్తున్నారు. ఇలాంటి ఆరోపణలనే ఎదుర్కొంటున్న బీజేపీ నేతల జోలికి మాత్రం దర్యాప్తు సంస్థలు వెళ్ళటం లేదు.

మోడీ చేస్తున్న పనులన్నీ అందరి కళ్ళకు కనబడుతుంటే ఇక ప్రతిపక్షాలు మోడీకి ఎందుకు సహకరిస్తాయి ? ప్రతిపక్షాల నేతలు, సమాజంలో ప్రముఖులపైన స్పైవేర్లతో నిఘా పెట్టి వ్యక్తిగత జీవితంలోకి కూడా చొరబడుతుంటే మోడీని ఎవరు సమర్ధిస్తారు ? ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రతిపక్షాలు మాట్లాడాలని ప్రయత్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు. రోజుల తరబడి గొడవలువతున్నా మోడీ ఏమాత్రం పట్టించుకోవటంలేదు. పార్లమెంటులోనే మోడీ ఉన్నా కనీసం నోరిప్పి కూడా మాట్లాడటం లేదు. కాబట్టి ముందు మోడీ తన వ్యవహార శైలిని మార్చుకుని అప్పుడు ప్రతిపక్షాలకు పిలుపిస్తే బాగుంటుంది.