క్రిస్ గేల్ ను ఆశ్చర్యపరిచిన ప్రధాని మోడీ

Wed Jan 26 2022 14:03:39 GMT+0530 (India Standard Time)

Prime Minister Modi surprised Chris Gayle

బుధవారం 73వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారత్‌కు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత్‌కు గేల్ శుభాకాంక్షలు చెప్పడం అసాధారణం కాదు.. అయితే అతను భారత ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రత్యేక సందేశాన్ని అందుకొని షాక్ కు గురయ్యాడు.“నేను భారత 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశానికి శుభాకాంక్షలు తెలియజేశాను. ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ ను ట్యాగ్ చేస్తూ ఈ మేరకు ట్వీట్ చేశాను. భారతదేశ ప్రజలతో నా సన్నిహిత వ్యక్తిగత సంబంధాలను పునరుద్ఘాటిస్తూ ఈ సందేశమిచ్చాను. అయితే దీనికి సమాధానంగా మోడీ నుంచి వ్యక్తిగత సందేశం వచ్చింది. మోడీ మెసేజ్ తోనే నేను మేల్కొన్నానని.. తనకు ఇది ఆశ్చర్యానికి గురిచేసిందని యూనివర్స్ బాస్ ఆనందపడుతూ  ట్వీట్ చేశాడు.

ప్రధానమంత్రి మోడీ యూనివర్స్ బాస్‌కు మెసేజ్ సందేశాన్ని పంపడం ఆసక్తికరమైన విషయం. ఆ సందేశంలో ఏమి ఉండవచ్చన్నది  ప్రస్తుతానికి తెలియదు. కానీ భారత్‌తో గేల్‌కు ఉన్న అనుబంధాన్ని మనం ఎప్పటికీ గౌరవిస్తాం.

ఐపీఎల్ తో  గేల్ ఇక్కడ భారీ అభిమానులను సంపాదించుకున్నాడు. సంవత్సరాలుగా అతను ప్రతి క్రికెట్ అభిమానిని అలరించాడు. హాస్యాస్పదంగా ఉండే గేల్ ఈ సంవత్సరం ఐపీఎల్ మెగా వేలం నుండి తనను తాను తప్పించుకున్నాడు. ఇప్పటికే వెస్టిండీస్ తరుఫున క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటించిన గేల్.. ఈసారి ఆడడం కష్టమేనంటున్నాడు.