Begin typing your search above and press return to search.

మహా ట్విస్ట్ : ఏ క్షణంలోనైనా రాష్ట్రపతిపాలన...?

By:  Tupaki Desk   |   26 Jun 2022 3:30 PM GMT
మహా ట్విస్ట్ : ఏ క్షణంలోనైనా రాష్ట్రపతిపాలన...?
X
మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఏ క్షణంలోనైనా రాష్ట్రపతిపాలన విధించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించిన సంకేతాలు అందుతున్నాయి. ఈ దిశగా రంగంలోకి దిగిన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ రాష్ట్ర ఉన్నత స్థాయి పోలీసులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది.

అదే విధంగా ఆయన ఎప్పటికప్పుడు సమాచారాన్ని కేంద్ర హోం శాఖతో పంచుకుంటున్నట్లుగా చెబుతున్నారు. శివసేనలో భారీ చీలిక ఏర్పడింది. దాన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ చూస్తోంది. ఇక దానికి తగిన పరిస్థితులను మహారాష్ట్రలో ఉంచడం కోసం ప్రయత్నాలు తెర వెనక జోరుగా సాగుతున్నాయి. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తే పూర్తి కంట్రోల్ కేంద్రానికి వస్తుంది.

ఇక రెబెల్ ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు, వారి ఆఫీసుల మీద దాడులతో శివసేన వేరే రకం స్కెచ్ ని అమలు చేస్తోంది అంతే కాదు మీరు ఎక్కడో ఉంటే తిన్నగా ముంబై వచ్చేటట్లు చేస్తామని అంటోంది. ఇక శివసైనికులు రెచ్చిపోతే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే గత వారంగా గుజరాత్ లోని సూరత్, అటునుంచి గౌహతిలో ఉన్న రెబెల్ ఎమ్మెల్యేలు ఇపుడున్న పరిస్థితుల్లో ముంబైలో కనీసం కాలు కూడా పెట్టే సాహసం అయితే చేయలేకపోవచ్చు అని అంటున్నారు.

వారు కనుక వస్తే మాత్రం ఇప్పటికీ అధికారంలో ఉన్న ఉద్ధవ్ థాక్రే సర్కార్ నుంచి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు అని అంటున్నారు. దాంతో గౌహతి నుంచి రెబెల్స్ రాకుండా అక్కడే ఉంటున్నారు. మరో వైపు క్యాంప్ రాజకీయాన్ని కొనసాగించడం రెబెల్ లీడర్ షిండేకు కూడా కష్టతరంగా మారుతోంది. ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కి శివసేన పెద్దలు తెరతీయడంతో ఎవరైనా మనసు మార్చుకుంటే అపుడు సీన్ మొత్తం మారుతుంది.

అలా జరగకుండా ఉండాలంటే ముందు రాష్ట్రపతిపాలన పెట్టడమే మార్గమని తెర వెనక ఉన్న బీజేపీ పెద్దలు భావిస్తున్నారుట. ఇంకో వైపు తాజాగా గుజరాత్ లోని వడోదరాకు స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళిన రెబెల్ లీడర్ షిండే అక్కడ ఉనన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ మాజీ ముఖ్యమంత్రి దేవెందర్ ఫడ్నవీస్ తోనూ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. దాని పర్యవశానమే రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా ఉద్ధవ్ థాక్రే సర్కార్ ని ఉంచకూడదు అన్న కృత నిశ్చయానికి వచ్చిన బీజేపీ రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని వాడే చాన్స్ ఎక్కువగా ఉంది. అది ఏ క్షణమైనా జరగవచ్చు.