ప్రశాంత్ కిషోర్ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నాడా?

Sat Apr 13 2019 20:26:55 GMT+0530 (IST)

Prashant Kishor Team Hijacking Credit

పోలింగ్ ప్రక్రియ  ముగిశాకా.. చాలా మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు. దీనికి అనేక కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. భారీ ఎత్తున పోలింగ్ నమోదు కావడం జనసేన కొన్ని చోట్ల టీడీపీ ఓట్లనే చీల్చడం వంటి విశ్లేషణలతో పాటు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుకూలతలు ఏవీ ఈ సారి కనిపించకపోవడం.. ఇక పోలింగ్ తర్వాత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరు.. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి గెలవడం కష్టమేనేమో అనే అభిప్రాయాన్ని కలిగిస్తూ ఉన్నాయి.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. అయితే అసలు కథ ఏమిటనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు!ఇక ఫలితాలు రాకముందే ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో క్రెడిట్ కోసం పోటీ మొదలైందా? అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ప్రత్యేకించి జగన్ పొలిటికల్ సలహాదారు ప్రశాంత్ కిషోర్ టీమ్ హడావుడి ఎక్కువగా ఉంది. ఫలితాలు రాకముందే వారు గెలిచినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు.

ఇలాంటి నేపథ్యంలో వాళ్లది క్రెడిట్ కోసం పోటీ అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినా.. దానికి అనేక రీజన్లుంటాయి. ప్రభుత్వ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు అంతంత మాత్రంగా ఉండటం.. ఇక జగన్ సుదీర్ఘ పాదయాత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దగ్గర నుంచి కార్యకర్తల వరకూ అంతా గట్టిగా కష్టపడటం.. వంటి రీజన్లన్నీ ఉంటాయి.

ఒక దశలో అసలు ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్ కోసం పని చేస్తూ ఉందా.. అనే సందేహం కూడా కలిగింది. ఎన్నికల ముందు అలా జరిగింది. అయితే తీరా పోలింగ్ తర్వాత మాత్రం పీకే టీమ్ కొంచెం ఓవర్ చేస్తున్నట్టుగానే ఉంది. క్రెడిట్ కోసం పాకులాడుతూ ఉన్నట్టుంది!