Begin typing your search above and press return to search.

‘అది నాన్ సెన్స్ సినిమా’.. కశ్మీర్ ఫైల్స్ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:31 PM GMT
‘అది నాన్ సెన్స్ సినిమా’.. కశ్మీర్ ఫైల్స్ పై ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్
X
కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ ఈవెంట్ లో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విజయాన్ని కొనియాడుతూనే.. ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

‘పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలన్న ఈ ఇడియట్స్, బిగాట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడా సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసి దూసుకుపోతోంది. పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలని గోల చేసినవారే.. మోడీ సినిమాకు కనీసం రూ.30 కోట్లు కూడా వసూలు రాబట్టలేకపోయారు. అలాంటి వారు కేవలం మొరుగుతారంతే.. కరవరు.. జస్ట్ సౌండ్ పొల్యూషన్ మాత్రమే’ అని ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు.

కేవలం రూ.30 కోట్లు రాబట్టిన ‘పీఎం నరేంద్ర మోదీ’ చిత్రం పరాజయంతో పోలిస్తే, బాక్సాఫీస్ వసూళ్లలో రూ.700 కోట్లతో ‘పఠాన్’ విజయాన్ని పోలుస్తూ ప్రకాష్ రాజ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు.

ఈ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, “ ఈ మూర్ఖులు, మతోన్మాదులు...పఠాన్‌ను నిషేధించాలని కోరుకునే వారు, రూ. 30 కోట్లతో మోదీ సినిమాను మరి ఎందుకు నడపలేదు. అవి మీకు తెలిసినవే... మొరిగేవి, కరవవు.. ఒట్టి సౌండ్ పొల్యూషన్" అని సంచలన కామెంట్స్ చేశారు.

ఆ తర్వాత వివేక్ అగ్నిహోత్రి యొక్క ది కాశ్మీర్ ఫైల్స్‌ సినిమాను ప్రకాష్ రాజ్ విమర్శించాడు, “కాశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్ చిత్రాలలో ఒకటి.. కానీ దానిని ఎవరు నిర్మించారో మాకు తెలుసు. సిగ్గులేదు. అంతర్జాతీయ జ్యూరీ వారిపై ఉమ్మివేస్తుంది. నాకు ఆస్కార్‌ ఎందుకు రావడం లేదని దర్శకుడు అడిగాడు. అతనికి భాస్కర్ అవార్డ్ కూడా రాదు. అక్కడ సెన్సిటివ్ మీడియా ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ మీరు ప్రచార చిత్రం చేయవచ్చు. నా మూలాల ప్రకారం... కేవలం ఇలాంటి సినిమాల కోసం 2000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ ప్రతీసారి జనాలను ఫూల్ చేయలేరు’ అంటూ ప్రకాష్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు.

ఇటీవల కాలంలో ఆస్కార్ అవార్డుకు పేరడీగా ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘భాస్కర్’ అవార్డుతో ఓ కామెడీ సీన్ ను క్రియేట్ చేశారు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రకాష్ రాజ్ ఇలా సెటైర్లు వేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.