Begin typing your search above and press return to search.

ఏపీ మండలి: పోతుల సునీత రాజీనామా ఆమోదం

By:  Tupaki Desk   |   30 Nov 2020 3:40 PM IST
ఏపీ మండలి: పోతుల సునీత రాజీనామా ఆమోదం
X
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్ షరీఫ్ సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలుకు సభ నివాళులు అర్పించింది.

ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు ఎస్పీ బాలుకు మండలి సభ్యులు నివాళులర్పించారు. వారి సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం సంతాప తీర్మాణాలను ఆమోదిస్తున్నట్టు చైర్మన్ షరీఫ్ ప్రకటించారు.

అనంతరం బీఏసీ సమావేశం కోసం సభను వాయిదా వేశారు. సభను మొత్తం ఐదురోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు డిసెంబర్ 4వరకు సమావేశాలు జరుగనున్నాయి. మొత్తం 19 బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు. బీఏసీలో మొత్తం 21 అంశాలను వైసీపీ ప్రతిపాదించింది.

బీఏసీ సమావేశం అనంతరం సభ తిరిగి ప్రారంభమైంది. అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ఆమోదించి మండలికి పంపడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. దీనిపై విపక్ష టీడీపీ వైఖరి ఎలా ఉండబోతోందన్న ఆసక్తి నెలకొంది.

ఇక ఇటీవలే రాజీనామా చేసి టీడీపీ ఎమ్మెల్సీ సునీత అభ్యర్థిత్వానికి మండలి ఆమోదించింది. టీడీపీ ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన పోతుల సునీతపై అనర్హత వేటు వేయాలని టీడీపీ మండలి చైర్మన్ కు గతంలో టీడీపీ ఫిర్యాదు చేయగా.. ఆమెనే రాజీనామా చేశారు. దాన్ని తాజాగా మండలి చైర్మన్ ఆమోదించారు.