ఆన్ లైన్ క్లాసుల్లో అశ్లీల ఫొటోలు

Thu Apr 08 2021 17:00:01 GMT+0530 (IST)

Pornographic photos in online classes

కరోనా నేపథ్యంలో ఇప్పుడు విద్యార్థుల చదువులు అటకెక్కాయి. కొన్ని ముఖమైన తరగతులను ఇప్పుడు అంతా ఆన్ లైన్ లోనే చదువుతున్నారు. అయితే తాజాగా ఆన్ లైన్ క్లాసుల్లోకి కూడా ఆకతాయిలు చొరబడి నానా యాగీ చేస్తున్నారు.ఇలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి.తాజాగా ఖైరతాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ బుధవారం సిటీ సైబర్ క్రైం ఠాణాలో ఈ తరహా నేరంపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ తన విద్యార్థులకు ఆన్ లైన్ లో ఇంగ్లీష్ పాఠం చెప్తుండగా కొందరు ఆకతాయిలు ఉద్దేశపూర్వకంగా క్లాసులోకి ప్రవేశించారు. అసభ్య అశ్లీల ఫొటోలను పోస్టు చేసి ఇతర విద్యార్థులకు ఇబ్బందులు కలుగజేశారు.

దీనిపై ఫ్రిన్సిపాల్ సీరియస్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఆన్ లైన్ క్లాసుల్లో ఉన్న విద్యార్థుల్లో ఎవరో ఒకరి ఈమెయిల్ ఐడీ పాస్ వర్డ్ సదురు ఆకతాయిలకు తెలిసి ఉంటాయని.. అందులో ఆన్ లైన్ లో క్లాసులోకి వచ్చి ఉంటారని పోలీసులు నిర్ధారించారు.

వారు ఎవరనేది ఆరాతీస్తున్నారు. త్వరలోనే పట్టుకొని తగిన శిక్ష వేస్తామని పోలీసులు తెలిపారు.