Begin typing your search above and press return to search.

పూర్ టూ రిచ్ : బాబు చెబుతున్నది ఎవరికైనా అర్ధమవుతోందా...?

By:  Tupaki Desk   |   6 Jun 2023 11:00 PM GMT
పూర్ టూ రిచ్ : బాబు చెబుతున్నది ఎవరికైనా అర్ధమవుతోందా...?
X
పూర్ టూ రిచ్ అన్న ఒక పధకాన్ని ఇటీవల రాజమండ్రి లో మినీ మ్యానిఫేస్ట్లో రిలీజ్ లో భాగంగా చంద్రబాబు ప్రకటించారు. పేదల ను లేని ఏపీ ని చేస్తామని చెప్పారు. అదెలా సాధ్యమంటే టెక్నాలజీ ఉంది. వనరులు ఉన్నాయి. లీడర్ షిప్ ఉందని బాబు చెప్పుకొచ్చారు. ఇవన్నీ కలిస్తే పేదలు ధనవంతులు అవుతారు అని ఆయన అంటున్నారు.

అలాగే మరో మాట అన్నారు. 1990 తరువాత దేశం లో వచ్చిన ఆర్ధిక సంస్కరణల తో చాలా మంది సంపన్నులు అయ్యారని, సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఇపుడు అలా కాకుండా పూర్ టూ రిచ్ కార్యక్రమం ద్వారా పేదలు అందరూ ధనవంతులు కావాలన్నదే తన అజెండా అని బాబు చెబుతున్నారు.

పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ తో దేశం లో మౌలిక సదుపాయల ను ఎలా అభివృద్ధి చెసుకుంటున్నామో అలా ప్రభుత్వం సంపన్నులు అందరూ కలసి పేదల ను ధనవంతులు చేయాల ని బాబు కోరుతున్నారు. అది సాధ్యమే అని ఆయన చెబుతున్నారు. బాబు చెబుతోంది వింటే బాగానే ఉన్నట్లుంది అనిపిస్తోంది కానీ అసలు ఏమీ అర్ధం కావడంలేదు.

ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం లో రోడ్లు బ్రిడ్జీలు కట్టడం వేరు. కట్టిన తరువాత పాతిక ముప్పయ్యేళ్ళ పాటు దాని మీద ఆదాయాన్ని తీసుకునే రైట్ ప్రైవేట్ పార్టనర్ కి ఇస్తారు. అలాగే భూములు ఇతర వనరులు కూడా ఇస్తారు. పేదల ను డబ్బున్న వారిని చేయమని సంపన్నుల కు ఏమి ఇస్తారు అన్నది ఒక ప్రశ్న.

అలా ప్రభుత్వాలు వారికి ఇచ్చేదే ఉంటే తామే ఆ మేలు చేస్తే బాగుంటుంది కదా. అయినా నూటి కి ఎనభై శాతం ఈ దేశం లో పేదలు ఉన్నారు. వందల దేశాలు పేదరికం తో ప్రపంచం లో ఉన్నాయి. పేదల ను ధనికుల ను చేస్తే సక్సెస్ మంత్ర వారి కి తెలిస్తే ఈ రోజున ప్రపంచమే పేదరికం అన్న మాటను మరచిపోయేది కదా అన్న ప్రశ్న వస్తోంది.

నినాదాలు అందంగా ఉంటాయి. ఆచరణ కు మాత్రం చాలా పనికిరావు. ఇపుడు చంద్రబాబు చెబుతున్నది అలాగే ఉంది. ఎవరికైనా తామూ ధనవంతులు కావాలన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ మీద రాజకీయ పార్టీలు ఆకర్షణల తో కూడిన హామీలు గుప్పిస్తే రాజకీయం పండవచ్చేమో కానీ పేదరికం లేని సమాజం ఎలా ఆవిష్కృతం అవుతుందో ఎవరికీ తెలియని విషయమే.

పేదల ను ధనికులు దత్తత తీసుకోవాల ని అంటున్నారు. ఎవరైనా ఊరకే తమ ఇంట్లో పనిచేసే పేదలకే కోరి ఒక్క రూపాయి అయినా ఇవ్వరు. అలాంటిది వారిని దత్తపుత్రులు గా స్వీకరించి తమ ఆస్తి వారికి రాస్తారా లేక వారికి డబ్బు ఎలా సంపాదించాలో చెప్పి ధనవంతులుగా చేస్తారా అంటే ఇవన్నీ అర్ధం కానీ విషయాలే అని మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది.

ప్రతీ ఎన్నికకూ ఒక బలమైన ఎన్నికల నినాదం కావాలి. ఏపీలో పేదల కు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాను అని జగన్ చెప్పుకుంటున్నారు. తాను పేదల పక్షం అని ఆయన అంటున్నారు దానికి పోటీ గా పేదల ను అందరికీ ధనవంతుల ను చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్నారు కానీ ఇది ఏ లాజిక్ కి అందకుండా ఉంది. ఎవరికీ అర్ధం కాకుండా కూడా ఉంది.

డబ్బున్న వాడు తన బంధువులు చుట్టాల పట్లనే పట్టనట్లుగా ఉంటాడు. అలాంటిది పేదలను దగ్గర కు ఎందుకు తీస్తాడు. బేసికల్ గా మనిషి స్వార్ధపరుడు. తన సంపాదన తానూ అన్నట్లుగా ఉండే వర్తమాన సమాజం లో బాబు సోషలిజం నినాదాలు వల్లిస్తున్నారు. అయితే ఇవన్నీ ఆచరణ సాధ్యం కావని, ఏ విధంగానూ అమలు కు నోచుకోనివని అంటున్నారు.

ఆర్ధిక సంస్కరణల వల్ల పేదల లో కూడా కొనుగోలు శక్తి పెరిగింది అన్నది చంద్రబాబు లాంటి రాజకీయ దిగ్గజానికి తెలియదా అన్న వారూ ఉన్నారు. డబ్బున్న వాడు ఒక కోటికి పది కోట్లు అదనంగా సంపాదిస్తే పేదవాడు ఒక రూపాయి కి మరో రెండు రూపాయలు అదనంగా సంపాదిస్తాడు. ఆర్ధిక సంస్కరణల వల్ల జరిగింది ఇదే.

ఎపుడూ ఆకాశాని కి నేల కు ఉన్న తేడా అలాగే ఉంటుంది. అదే విధంగా పేదలు ధనికుల మధ్య వ్యత్యాసం అలాగే ఉంటుంది. ఒక కంపెనీ ని అందరూ నడిపి లాభాలు తెస్తే యజమాని ఉద్యోగుల కు కేవలం జీతాలు మాత్రమే ఇచ్చి తాను మాత్రం లాభాల ను అనుభవిస్తాడు. ఎందుకంటే కంపెనీ లో పెట్టుబడి తనదని చెబుతాడు. మానవ వనరుల ను పెట్టుబడిగా క్యాపిటలిస్టులు ఎపుడూ కొలమానంగా తీసుకోరు.

చంద్రబాబు చెబుతున్న పూర్ టూ రిచ్ అన్నది ముందుగా ప్రైవేట్ కంపెనీల లో అమలు చేసి యజమాని కార్మికుడు తేడా లేకుండా అందరూ కంపెనీ లాభాల లో సమాన భాగస్వామి అన్న చట్టం లాంటిది తీసుకుని వస్తే ఆయన చెబుతున్న పూర్ టూ రిచ్ కి ఎంతో కొంత అర్ధం ఉంటుందే. ఏది ఏమైనా బాబు ఒక బ్రహ్మ పదార్ధాన్ని ఏవరికీ అర్ధం కాని విషయాన్ని పట్టుకుని అందరినీ సంపన్నుల ను చేస్తాను అంటున్నారు. నిజంగా దీన్ని పేదలు నమ్ముతారా లేక ఎన్నికల హామీ గా చూసి తమ పెదవుల మీద ఒక నీరసపు నవ్వుతోనే జవాబు చెబుతారా అన్నది చూడాల్సి ఉంది.