Begin typing your search above and press return to search.
ఆ పార్టీలోకే పొంగులేటి చేరిక.. ముహూర్తం ఖరారు!
By: Tupaki Desk | 9 Jun 2023 2:16 PM GMTతెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరతారనే దానిపై నెలకొన్న ఉత్కంఠ దాదాపు తొలిగినట్టే కనిపిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరుల్లో మెజార్టీ నేతలు కాంగ్రెస్లో చేరాలని చేసిన సూచనతో పొంగులేటి సైతం అదే నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఈ మేరకు కాంగ్రెస్ లో చేరికకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల ముఖ్య నేతలతో ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ లో చేరాలని నేతలంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాను యుద్ధం ప్రకటించి 5 నెలలు అవుతోందని గుర్తు చేశారు. తానొక్కడినే యుద్ధం చేస్తే గెలవలేమని.. అందరం కలిసికట్టుగా యుద్ధం చేయాలి అని పిలుపునిచ్చారు. కార్యకర్తలు, ప్రజల అభిమానమే తన బలమని తెలిపారు.
పదవులు ఉన్నా లేకున్నా ప్రజలతోనే ఉంటానని వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయాల మేరకు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కార్యకర్తల నిర్ణయమే తన నిర్ణయమని ప్రకటించారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయం ప్రకటిస్తానన్నారు.
తన టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ అని.. దానికి వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామన్నారు. తనపై విమర్శలు చేసేవారికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. ఖమ్మంలో కనీవినీ ఎరుగని రీతిలో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ ప్రెస్ మీట్ లోనే బహిరంగ సభ తేదీ ఎప్పుడనేది ప్రకటిస్తామన్నారు. తాను చేరబోయే పార్టీకి సంబంధించిన అతిరథ మహారథులు సభకు వస్తారు అని పొంగులేటి వెల్లడించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పొంగులేటి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో ముఖ్యనాయకులు, అనుచరుల్లో అత్యధిక మంది కాంగ్రెస్లో చేరాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కలిసి వచ్చే నేతలందరూ ఒకేసారి కాంగ్రెస్ గూటికి చేరతారని సమాచారం.