ఎవరికి విజయం.. ఎవరిది సంకల్పం.. మోడీ సభపై రాజకీయ రచ్చ!

Fri Jul 01 2022 08:00:01 GMT+0530 (IST)

Political debate over Modi tour telangana

దాదాపు ఏడాదిన్నర తర్వాత.. ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. అప్పట్లో సీరం ఇని స్ట్యూట్‌ను పరిశీలించిన ఆయన.. తర్వాత.. వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు రాజకీయంగానే ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వస్తున్నారు.హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జులై 2న నగరానికి చేరుకోనున్నారు.  మూడో తారీకున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొం టారు.

ఈ సభకు `విజయ సంకల్ఫ` సభగా నామకరణం చేశారు. రాష్ట్రంలో బీజేపీ విధానాలను ప్రక టించడానికి ప్రజలను చైతన్యం చేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్న కమలనాథులు.. 10 లక్షల మందిని తరలించాలని లక్ష్యం పెట్టుకున్నారు. చరిత్రలో నిలిచిపోయేవిధంగా ఈ సభ ఏర్పాట్లు చేస్తున్న ట్టు చెబుతున్నారు. కార్యకర్తలు ప్రజలు సభకు స్వచ్ఛందంగా తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సభా వేదిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

ఇప్పుడు దీనిపై ఆసక్తికర రాజకీయం నడుస్తోంది. ``ఎవరికి విజయం.. ఏమిటి సంకల్పం`` అని రాజకీయ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదు.. కనీసం.. విభజన చట్టంలో పేర్కొన్న పరిశ్రమలు.. సంస్థలను కూడా ఇవ్వడంలేదు.. అప్పు చేసుకుంటామంటే.. అనుమతులు కూడా ఇవ్వడం లేదు. ప్రతివిషయాన్నీ రాజకీయ కోణంలోనే చూస్తూ.. ప్రతివిషయాన్నీ.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రక్రియలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఉందనివిమర్శలు వస్తున్నాయి.

ఈనేపథ్యంలో ఇప్పుడు నిర్వహిస్తున్న `విజయ సంకల్ప` సభద్వారా. ఎవరికి ఈ ఎనిమిదేళ్లలో విజయాన్ని అందించింది? అ నే విషయాన్ని స్పష్టం చేస్తే.. బాగుంటుందని.. అంటున్నారు రాజకీయ నాయకులు.  

ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై ఎలాంటి సంకల్పం చెప్పుకొంటారో కూడా చెప్పాలని కోరుతున్నారు?  ఈ విషయంపైనే  రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుండడం గమనార్హం.  ఉపాధి లేదు.. ఉద్యోగాలు లేవు.. అప్పులు ఇవ్వరు.. అమ్మ పెట్టదు.. అనే తరహాలో ఉన్న తెలంగాణ  పరిస్థితిని ఎలా మారుస్తారో.. ఈ సందర్భంగా మోడీ స్పష్టం చేస్తారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.