Begin typing your search above and press return to search.

ప్లేటు బిర్యానీ.. రూ.20వేలు..ఎందుకంత రేటు?

By:  Tupaki Desk   |   24 Feb 2021 2:30 AM GMT
ప్లేటు బిర్యానీ.. రూ.20వేలు..ఎందుకంత రేటు?
X
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. బిర్యానీని వారానికి ఒకసారైనా సరే తెప్పించుకొని తింటుంటారు. హైదరాబాద్ బిర్యానీ అంటే దేశమంతా ఫేమస్. ఈ బిర్యానీ మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఫుల్ పాపులరే.మన దేశంలో సాధారణంగా ప్లేటు బిర్యానీ రేటు రూ.100 నుంచి మహా అయితే 500 లోపు ఉంటుంది. ఫైస్టార్ హోటల్స్ లో 1000 వరకు ఉంటుంది. అయితే తాజాగా దుబాయిలో దొరికే ఓ బిర్యానీ ధర చూస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే.దుబాయిలోని బాంబే బరో అనే భారతీయు రెస్టారెంట్ 'రాయల్ గోల్డ్ బిర్యానీ' పేరుతో బిర్యానీని స్పెషల్ ఐటంలతో చేస్తోంది. దీని ప్లేటు ధర 1000 దిర్హామ్ లు. భారత కరెన్సీలో దాదాపు రూ.20వేలు.

ఈ బిర్యానీని 23 కేరట్ల తినే బంగారంతో గార్నిష్ చేసి దీన్ని వడ్డిస్తారు. అందుకే దీనిని గోల్డ్ బిర్యానీ అంటారు. ఈ బిర్యానీలో విభిన్న రకాల బాస్మతి రైస్ వాడుతారు. కుంకుమపువ్వుతో చేసిన అన్నం, గుడ్లు, బంగాళదుంపలు, జీడిపప్పు, దానిమ్మ గింజలు ఉంచుతారు.ఈ బిర్యానీ కోసం కశ్మీరీ గొర్రె కబాబ్స్, రాజ్ పుత్ చికెన్ కబాబ్స్, మొఘలాయి కోఫ్తా వంటి మాంసం ముక్కలను పెట్టి వాటిపై 23 కేరట్ల బంగారాన్ని అలంకరిస్తారు. ప్రపంచంలోనే ఇదే అత్యంత ఖరీదైన బిర్యానీగా పేరొందింది.