బాబును అడ్డంగా బుక్ చేసిన కేంద్ర మంత్రి ప్రకటన

Tue Mar 26 2019 21:48:14 GMT+0530 (IST)

Piyush Goyal Challenges Chandrababu Naidu For Debate on NDA

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఊహించని చిక్కు వచ్చిపడింది. ప్రత్యేక హోదా విషయంలో ఆయన తీసుకున్న యూటర్న్ మరోమారు బహిరంగం అయింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత - రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు సంబంధించిన మరో కోణాన్ని ఆవిష్కరించారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్వర్యంలో ‘2019 ఎన్నికల మానిఫెస్టో’ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు చేసిన సాయం - అభివృద్ధి - ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్దమని అని  సవాల్ విసిరారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోదీ ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు.ప్రత్యేక హోదాకు ప్రత్నామ్యాయంగా ఇస్తామన్న ప్యాకేజీని  తీసుకునేందుకు ఒప్పుకుని తర్వాత తన రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు మాట మార్చారని గోయల్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ప్రధాని పార్లమెంటులో ప్రకటించారని - ఆ మేరకు అభివృద్ధి  చేస్తున్నారన్నారు. హోదాకు బదులుగా ప్యాకేజీని ప్రశంసించి మరల హోదానే కావాలని చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారన్నారు. ప్యాకేజీని కోరుతూ ఆయన రాసిన లేఖలను సభలో చూపించారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు దేశ రాజధానిలో సిద్దమని - దమ్ముంటే చంద్రబాబు తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు 2017లో తెదేపా మహానాడు  కార్యక్రమంలో ప్యాకేజీని స్వాగస్తూ తీర్మానం చేశారు. హోదా వేరు - రాయితీలు వేరు అని కూడా ప్రకటించారు. అలాగే అసెంబ్లీలోను తీర్మానించారు. హోదా పొందిన రాష్ట్రాలకు ఎలాంటి లాభం కలుగలేదని ప్యాకేజీని మేలని చెబుతూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీకి 2016 అక్టోబర్ 24న చంద్రబాబు లేఖ రాశారు. హోదా వల్ల రూ. 3500 కోట్లు మాత్రమే ఆర్ధిక  సహాయం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తేనే కేంద్రం దానికి ఒప్పుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రాజెక్టుల రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయంటే అవన్నీ ప్యాకేజీలోనివే 14 వ ఆర్ధిక సంఘం  నిధుల వ్యత్యాసం చూపించవద్దని కోరడంతో ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వడం లేదన్నారు.

ఎన్ టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన కాంగ్రెస్ తో చంద్రబాబు కలసి తెలుగుప్రజల ఆత్మాభిమాన్ని దెబ్బతీశారని గోయల్ ఆరోపించారు. కాంగ్రెస్ తో కలసి తెలంగాణలో పోటీ చేసినా ప్రజలు తిరస్కరించారు. అవినీతి - కుటుంబ పాలనతో చంద్రబాబు ప్రజాదరణ కోల్పోయారు. ఇప్పుడు తెదేపాకు సరైన నాయకత్వం లేదు. అవినీతికి పాల్పడి దర్యాప్తు సంస్థలకు భయపడుతున్నారు.  ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా అయిదేళ్లలోనే 95శాతం పూర్తిచేసిందన్నారు. హోదాకు బదులుగా రెట్టింపు నిధులు ఇచ్చిందని - అయిదేళ్లపాటు రెవెన్యూలోటు రూ.22123 కోట్లు - రూ.5.50 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు మంజూరు చేసిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.7వేల కోట్లు అందచేసిందని పేర్కొన్నారు.