Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   26 July 2021 4:30 PM GMT
హుజూరాబాద్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన మాజీ మంత్రి
X
హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ పెద్దిరెడ్డి.. తనకు ఇష్టం లేకుండా ఈటల రాజేందర్ ను చేర్చుకోవడంపై కొద్దిరోజులుగా రగిలిపోతున్నారు. ఈటల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈటల చేరినప్పటి నుంచి ఆయన బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీలో ఇమడలేకపోతున్నామనే భావనలో పెద్ది రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.ఇటీవల బీజేపీ కార్యక్రమాలకు కూడా దూరంగా జూరిగారు.

పెద్దిరెడ్డి గతంలో చంద్రబాబు హయాంలో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేశారు. కరీంనగర్ జిల్లాలో ఆయన బలమైన నాయకుడిగా వెలుగు వెలిగారు. ప్రస్తుతం టీడీపీ తెలంగాణలో దిగజారాక బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈటల చేరికతో బీజేపీలో పెద్దిరెడ్డి తెగ ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈటల రాకను వ్యతిరేకిస్తూ తాజాగా బీజేపీకి గుడ్ బై చెప్పారు.

ఇవాళ పెద్ది రెడ్డి బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పంపారు.

తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ ఇది బీజేపీకి గట్టి షాక్ అని చెప్పొచ్చు. ఇాప్పటికే కీలక నేతలు ఒక్కరొక్కరు బీజేపీలో చేరారు. కనీసం తనతో చర్చింకుండానే ఈటల రాజేందర్ ను బీజేపీలో చేర్చుకొన్నారని ఆయన పార్టీ నాయకత్వంపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసి తాజాగా రాజీనామా చేసేశారు.

ఇప్పటికే మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా గత వారం క్రితమే బీజేపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు పెద్దిరెడ్డి సైతం ఆ బాటపట్టారు.