ఎన్నిసార్లు కోర్టుకు వెళతారని పవన్ ప్రశ్న

Sat Jan 23 2021 21:45:35 GMT+0530 (IST)

Pawan Kalyan slams AP government over Panchayat elections

ఏపీ పంచాయితీ ఎన్నికల రచ్చ ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వర్సెస్ సీఎం జగన్ మధ్య వార్ పీక్ స్టేజీలో నడుస్తోంది.  ఇద్దరూ ఎన్నికలపై కోర్టుల చుట్టూ తిరుగుతూ అస్సలు పని కానివ్వడం లేదు.ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం ఈ వివాదంపై స్పందించారు.పంచాయితీ ఎన్నికలపై వైసీపీ సాకు సరైంది కాదని పవన్ అన్నారు. కరోనా సమయంలోనూ వైసీపీ నేతలు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని పవన్ గుర్తు చేశారు.ఎన్నికలపై ఎన్ని సార్లు కోర్టుకు వెళతారని పవన్ ప్రశ్నించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ జడ్జిలను కులాల పేరుతో దూషించారని విమర్శించారు.కరోనా వ్యాక్సిన్ ఆరోగ్యసిబ్బందితోపాటు ఉద్యోగులకూ ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు.ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా పంచాయితీ ఎన్నికలకు సహకరించాలని డిమాండ్ చేశారు.