Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ యాత్ర డేట్ ఫిక్స్.. ప్రజల్లోకి ఎప్పటి నుంచంటే?

By:  Tupaki Desk   |   14 Aug 2022 1:32 PM GMT
పవన్ కళ్యాణ్ యాత్ర డేట్ ఫిక్స్.. ప్రజల్లోకి ఎప్పటి నుంచంటే?
X
జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్రకు రంగం సిద్ధమైంది. ఈ దసరా తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.ఇప్పటికే ప్రకటించిన పవన్ అన్నట్టుగానే రెడీ అవుతున్నారు. జనసేన నిర్వహించిన ఐటీ సమ్మిట్ లో 600 మంది నిపుణులు పాల్గొన్నారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా నాదెండ్ల ప్రకటించారు.

ఏ రాజకీయ పార్టీ చేయని క్రియాశీల కార్యకర్తల నమోదును జనసేన చేపట్టిందన్నారు. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీవింగ్ కీలకంగా ఉందన్నారు. ఐటీ వింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని సూచించారు.
ఈరోజు రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జన యాత్ర తేదీని ప్రకటించారు. అక్టోబర్ 5 నుంచి యాత్ర ప్రారంభిస్తారని.. రాష్ట్రవ్యాప్తంగా పవన్ పర్యటనలు ఉంటాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఓ వైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తూనే పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఇకనుంచి పార్టీ పటిష్టత కోసం జనంలోకి వెళ్తారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని పార్టీ కార్యకర్తలు పనిచేయాలని సూచిస్తారని అంటున్నారు.

పవన్ కల్యాణ్ సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు బస్సు యాత్రకు రెడీ అయ్యారు. అయితే బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు ఈ సభలో వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను వినే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమం చేపట్టేందుకు ప్లాన్ వేస్తున్నారు.

గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీచేసి ఓడారు. ఆయన పార్టీ ఒకే సీటును గెల్చుకుంది. కానీ ఈసారి అలా కాకుండా పార్టీ అధికారంలో రావడమే లక్ష్యంగా పనిచేయాలని పవన్ సూచిస్తారట. అందుకు అవసరమైన సమీకరణాలను ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో భాగంగా కాపునేతలతో పాటు ఎస్సీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త సమీకరణం తెరమీదకు తెచ్చే ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. వైసీపీ, టీడీపీ లకు రెండు సామాజిక వర్గాలు అండగా నిలిచే అవకాశం ఉన్నందున ఇప్పుడు జనసేన కూడా ఆ వర్గాలకు చెందిన వారికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది.

2019 ఎన్నికల్లో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ ఆ స్థాయిలో ఓట్లు సీట్లు వచ్చినందున ఇప్పడు అదే ఫార్ములాను పవన్ పాలోకానున్నారు. ఇక పవన్ ఈ సభ ద్వారా ఎలాంటి ప్రసంగం చేస్తారోనని ఇప్పటికే జనసైనికుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే సభపై క్లారిటీ రావాలంటే మాత్రం 14 వరకు ఆగాల్సిందే.